యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది, బాహుబలి తో నేషనల్ వైడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత చేసిన సాహో సినిమా డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా హిందీ లో మాత్రం డిసాస్టర్ టాక్ తోనే సినిమా సూపర్ హిట్ గా…
నిలిచి అక్కడ దుమ్ము దుమారం లేపింది, అలాంటి విజయం తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న లవ్ స్టొరీ రాధే శ్యామ్ పై మరీ సాహో రేంజ్ లో అంచనాలు హిందీ లో ప్రస్తుతానికి లేవు కానీ డీసెంట్ అంచనాలు అయితే కచ్చితంగా ఉన్నాయి అని చెప్పాలి.
ఒక్కసారి సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ని కనుక సొంతం చేసుకుంటే హిందీ లో కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉండగా సినిమాను ఇప్పుడు ఓవరాల్ గా నార్త్ ఇండియా కి గాను మొత్తం మీద 50 కోట్ల రేంజ్ రేటు కి అమ్మినట్లు ట్రేడ్ లో సమాచారం అందుతుంది….
మొత్తం మీద 50 కోట్ల రేంజ్ బిజినెస్ ను హిందీ లో సొంతం చేసుకున్న రాధే శ్యామ్ సినిమా ఇప్పుడు అక్కడ మొత్తం మీద 110 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి… నెట్ కలెక్షన్స్ లో 45% టు 50% టాక్స్ లు రెంట్స్ అండ్ మెయింటైనెన్స్ లు కట్ అయ్యాక షేర్ వస్తుంది. ఓవరాల్ గా సాహో కలెక్షన్స్ లో…
సగాని కన్నా కొంచం ఎక్కువ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న రాధే శ్యామ్ ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ హిందీ లో దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ ఈ సినిమా తో అక్కడ ఎలాంటి రాంపేజ్ చూపెడుతాడో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.