బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయింది. సినిమా టీం అలాగే హీరో రవితేజ సినిమాను హిందీలో భారీ ప్రమోట్ చేశాడు…
అక్కడ మీడియాకి వెళ్లి ఇంటర్వ్యూలు అలాగే టీవీ షోలకు వెళ్లి సినిమాను బాగా ప్రమోట్ చేశాడు, కానీ ఇవేవి కూడా సినిమా హిందీ కలెక్షన్స్ పరంగా పెద్దగా ఏమి హెల్ప్ అవ్వలేదు అనే చెప్పాలి ఇప్పుడు…సినిమా అక్కడ రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో అక్కడ సినిమా కి…
కలెక్షన్స్ పరంగా భారీగా ఇంపాక్ట్ పడింది. సినిమా ఇప్పటి వరకు అక్కడ సాధించిన కలెక్షన్స్ కోటి రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది, అక్కడ సినిమా మొత్తం మీద సినిమా కి అయిన ప్రింట్స్ ఖర్చులు థియేటర్స్ ఖర్చులను కూడా రికవరీ చేయలేక పోయింది ఈ సినిమా…
అక్కడ మంచి కలెక్షన్స్ వస్తాయి అని భారీగా ఆశలు పెట్టుకున్న రవితేజకి సినిమా నిరాశ పరిచే రిజల్ట్ ను ఇచ్చింది, ఎడిట్ చేసిన వర్షన్ కి కొంచం బెటర్ రెస్పాన్స్ వస్తూ ఉండటంతో దసరా పండగ డేస్ లో కొంచం బెటర్ కలెక్షన్స్ వచ్చాయి కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా కి…
అక్కడ ఆశించిన రేంజ్ లో అయితే రెస్పాన్స్ సొంతం అవ్వలేదు, తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ టైంలో ఎట్టకేలకు సినిమా గ్రోత్ ని చూపించింది కానీ టీం ముందే ఎడిట్ చేసిన వర్షన్ ని రిలీజ్ చేసి ఉంటే సినిమా కి ఇంకా బెటర్ రిజల్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం అయ్యి ఉండేది అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.