Home న్యూస్ 3 ఏళ్లకి హౌస్ ఫుల్స్…దంచి కొడుతున్న నాగ చైతన్య!!

3 ఏళ్లకి హౌస్ ఫుల్స్…దంచి కొడుతున్న నాగ చైతన్య!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా మజిలీ, లవ్ స్టోరీ సినిమాలతో సోలో సూపర్ డూపర్ హిట్స్ ను, వెంకిమామ మరియు బంగార్రాజు లాంటి మల్టీ స్టారర్ హిట్స్ తో దుమ్ము లేపిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో ఇప్పుడు…

బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దూసుకు పోతున్నాడు…ఈ సినిమా కన్నా ముందు సోలో హీరోగా చేసిన థాంక్ యు మరియు కస్టడీ సినిమాలు రెండూ ఓ రేంజ్ లో నిరాశ పరిచాయి. 2022 లో థాంక్ యు, 2023 లో కస్టడీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ లను సొంతం చేసుకోగా…

మొదటి రోజు నుండే మినిమమ్ ఇంపాక్ట్ ను చూపించలేదు, ఇలాంటి టైంలో కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన తండేల్ మూవీ తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న నాగ చైతన్య ఆల్ మోస్ట్ సోలో హీరోగా 2021 లో వచ్చిన లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ ఇప్పుడు…

బాక్స్ ఆఫీస్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డులతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పాలి. సంక్రాంతి సినిమాల తర్వాత బాక్స్ ఆఫీస్ స్లో డౌన్ అవ్వగా ఇప్పుడు తిరిగి తండేల్ మూవీ క్లాస్ సెంటర్స్ తో పాటు మాస్ సెంటర్స్ లో కూడా హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అవ్వడం విశేషం.

చాలా చోట్ల ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో ఓపెన్ అయిన సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు కొన్ని మాస్ సెంటర్స్ లో కూడా పడటం మామూలు విషయం కాదు, మొత్తం మీద 3 ఏళ్లకి తిరిగి హౌస్ ఫుల్ బోర్డులతో కంబ్యాక్ ఇచ్చిన నాగ చైతన్య ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here