అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎప్పుడో లాంచ్ అయినా కెరీర్ లో తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పరచుకోవడంలో విఫలం అయిన సుశాంత్ అడపాదడపా సినిమాల్లో కనిపించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు. లాస్ట్ ఇయర్ అల వైకుంఠ పురంలో సినిమాలో చేసిన సైడ్ రోల్ తో కొంచం రీచ్ ని సొంతం చేసుకున్న సుశాంత్ ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో…
రాబోతున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్స్ ఏమి లేకున్నా కానీ ఈ సినిమా తో సాలిడ్ బిజినెస్ నే సొంతం చేసుకున్నాడు సుశాంత్, సినిమాను మొత్తం మీద 6.4 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా సినిమా కి నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే మంచి ప్రాఫిట్ దక్కింది…
సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహా వాళ్ళు 3 కోట్ల రేటు కి దక్కించుకోగా శాటిలైట్ రైట్స్ కి 2 కోట్ల రేటు సొంతం అయ్యింది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ కింద 2.75 కోట్ల రేటుని సొంతం చేసుకున్న ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ కింద 15 లక్షల రేటు ని దక్కించుకుంది…
దాంతో ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ 7.9 కోట్ల రేంజ్ లో జరగగా బిజినెస్ మీద 1.5 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ దక్కింది సినిమా కి. దాంతో సినిమాను థియేటర్స్ లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కంప్లీట్ గా ఓన్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా అడ్వాన్స్ లాంటిది లేకుండా ఓన్ రిలీజ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ఓన్ రిలీజ్ బిజినెస్ వర్త్…
ఓవరాల్ గా 2.3 కోట్ల ధర ఉండొచ్చు అని సమాచారం. దాంతో సినిమా ఓవరాల్ గా ఓన్ రిలీజ్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలి అంటే 2.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటే సరిపోతుంది. సినిమా కి పాజిటివ్ టాక్ వస్తే ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.