లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) మీద ఒక టైములో పీక్ అంచనాలు ఉండగా సినిమా డిలే అవ్వడంతో అంచనాలు తగ్గాయి. ఇలాంటి టైంలో విక్రమ్ తో కమల్ హాసన్ సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కగా….
పార్ట్2 వరకే అనుకుంటే సడెన్ గా పార్ట్3 కూడా మొదలు అవ్వగా కథ మొత్తం పార్ట్3 లో పెట్టి పార్ట్2 ని ఎదో పేరుకే తీసినట్లు అనిపించగా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. దాంతో ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది..
దాంతో ఇప్పుడు పార్ట్3 మీద భారీగా రికవరీని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక పార్ట్2 మరియు పార్ట్3 కలిపి మొత్తం మీద ఎంత బడ్జెట్ తో తెరకెక్కించారు అన్నది ఆసక్తిగా మారగా రెండు పార్టుల కోసం భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించారు…
చాలా రోజులు డిలే కూడా అవ్వడంతో సినిమా బడ్జెట్ హద్దులు దాటిపోయిందని అంటున్నారు….ఓవరాల్ గా రెండు పార్టులు కలిపి సినిమా బడ్జెట్ టోటల్ గా హద్దులు దాటిపోయి ఏకంగా 550 కోట్ల మమ్మోత్ బడ్జెట్ తో ఈ రెండు పార్టులు పూర్తి అయ్యాయని అంటున్నారు…
రెండో పార్ట్ కి సరిగ్గా ఎంత బడ్జెట్ అయ్యింది అన్నది మాత్రం క్లియర్ గా తెలియలేదు కానీ ఓవరాల్ గా రెండు పార్టులు కలిపి మమ్మోత్ బడ్జెట్ తో సినిమా రూపొందగా రెండో పార్ట్ భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న భారతీయుడు2 మూవీ…ఇక పార్ట్3 రెండో పార్ట్ నష్టాలను పూడ్చి ఎంతవరకు బడ్జెట్ ను రికవరీ చేస్తుంది అన్నది ఆసక్తికరం అని చెప్పాలి…