Home న్యూస్ చస్….4.5 కోట్లు ఔట్…రచ్చ లేపుతున్న భారతీయుడు2!

చస్….4.5 కోట్లు ఔట్…రచ్చ లేపుతున్న భారతీయుడు2!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) కల్కి 2898 AD(Kalki 2898 AD) హవా ఓ రేంజ్ లో కొనసాగుతూ ఉండగా మరో పక్క వచ్చే వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Director Shankar) ల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ భారతీయుడు2(Bharateeyudu2 Movie) భారీ లెవల్ లో…

రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్నట్లే అనిపిస్తుంది ఓవరాల్ గా ప్రీ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే…సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇది వరకు వచ్చిన శంకర్ మూవీస్ ట్రైలర్ లతో పోల్చితే చాలా సాదాసీదా మూవీలా అనిపించింది సినిమా…

కానీ శంకర్ మూవీ అవ్వడంతో సినిమా కచ్చితంగా అంచనాలను అందుకునే రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది అనిపించేలా అనిపించగా ఓవర్సీస్ లో సినిమా ప్రీ బుకింగ్స్ ను ఓపెన్ చేయగా అన్ని చోట్లా బుకింగ్స్ లో సూపర్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది ఇప్పుడు….

నార్త్ అమెరికాలో సినిమా కి రిలీజ్ కి ఇంకా 4 రోజులు ఉండగానే 3 లక్షలకు పైగా డాలర్స్ ను సొంతం చేసుకోగా రెస్ట్ ఆఫ్ ఓవర్సీస్ గ్రాస్ లెక్క 2 లక్షలకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక సినిమా మొత్తం మీద ప్రీ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఇప్పుడు….

5 లక్షల 30 వేలకు పైగా డాలర్స్ ను అందుకోగా ఇండియన్ కరెన్సీలో సినిమా కి 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసేలా స్టార్ట్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండటం విశేషం…మొత్తం మీద ట్రైలర్ వీక్ గా ఉన్న కూడా ప్రీ బుకింగ్స్ కుమ్మేస్తూ ఉండగా…

ఇక టాక్ పాజిటివ్ గా వస్తే కనుక శంకర్-కమల్ ల క్రేజీ కాంబో అండ్ సీక్వెల్ ఫ్యాక్టర్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here