లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) మూవీ మీద ముందు నుండి పెద్దగా అంచనాలు అయితే ఏమి లేవు…చాలా కాలంగా సినిమా డిలే అవుతూ రావడం, సీక్వెల్ ఒకటే పార్ట్ అనుకుంటే అనవసరంగా మూడో పార్ట్ ని యాడ్ చేయడం వలన రెండో పార్ట్ లో….
కథనే లేకుండా పోవడం వలన రిలీజ్ అయిన మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం హోల్డ్ ని చూపించలేకపోయింది.. శంకర్ కెరీర్ లో తీసిన సినిమాలు అన్నింటిలోకి ఏ సినిమా సొంతం చేసుకోని రేంజ్ లో…
నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుని డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తో పరుగును చాలా కష్టతరం చేసుకున్న సినిమా శంకర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలవబోతుంది. ఇలాంటి టైంలో సినిమా ఒక్క చిన్న రికార్డ్ ను ఈ ఏడాదికి గాను అందుకుని కొంచం ఊరట కలిగింది అని చెప్పాలి…
ఈ ఏడాది కోలివుడ్ నుండి రిలీజ్ అయిన మూవీస్ పరంగా హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలుగా అరణ్మనై4 మరియు మహారాజ సినిమాలు 100 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా వాటితో పోల్చితే భారీ బడ్జెట్ తో వచ్చిన ఇండియన్2 మూవీ…
5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా ఈ ఏడాది తమిళ్ సినిమాల పరంగా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా ప్రస్తుతానికి టాప్ ప్లేస్ లో దూసుకు పోతుంది…శంకర్ కమల్ ల కాంబో హైప్ దృశ్యా…అలాగే మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ దృశ్యా చూసుకుంటే మాత్రం…
అత్యంత నిరాశకలిగించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఇండియన్2 మూవీ ఓవరాల్ గా మాత్రం ఓ చిన్న రికార్డ్ ను ఈ ఏడాదికి గాను అందుకున్నా అప్ కమింగ్ మూవీస్ ఈ కలెక్షన్స్ ని అవలీలగా అందుకోవడం ఖాయమని చెప్పాలి. ఓవరాల్ గా ఇండియన్2 మూవీ భారీ నిరాశ కలిగించే కలెక్షన్స్ తో పరుగును పూర్తి చేసుకోబోతుంది ఇప్పుడు.