Home న్యూస్ ఇండియన్2 హిందీ బిజినెస్…అంత పెద్ద హిట్ కి ఈ బిజినెస్ ఏంటి సామి!!

ఇండియన్2 హిందీ బిజినెస్…అంత పెద్ద హిట్ కి ఈ బిజినెస్ ఏంటి సామి!!

0

ఇండియన్ బిగ్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్(Shankar) డైరెక్షన్ లో వచ్చిన ఎపిక్ మూవీస్ లో ఒకటి ఇండియన్(భారతీయుడు) సినిమా ఒకటి….అప్పట్లో సంచలనం సృష్టించిన ఆ సినిమా అన్ని చోట్లా ఓ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. హిందీలో సైతం అప్పట్లోనే 12 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.

అలాంటి సినిమా కి సీక్వెల్ గా ఇండియన్2 మూవీ ని ఎప్పుడో అనౌన్స్ చేసి షూటింగ్ మొదలు పెట్టినా అనేక సమస్యలను ఫేస్ చేసిన ఆ సినిమా కమల్ హాసన్(Kamal Haasan) విక్రమ్(Vikram Movie) తో ఎపిక్ కంబ్యాక్ సొంతం చేసుకోవడంతో మళ్ళీ ఇండియన్2 పట్టాలు ఎక్కింది. వరుస పెట్టి షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకోగా..

ఇప్పుడు ఆడియన్స్ ముందుకు జులై 12న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా జోరు అందుకుంటూ ఉండగా మొదటి పార్ట్ సక్సెస్ కి సెకెండ్ పార్ట్ కి రికార్డ్ లెవల్ లో బిజినెస్ జరగాలి, కానీ హిందీలో శంకర్ కమల్ ల కాంబోలో వస్తున్నా ఈ సినిమా కి మొత్తం మీద అడ్వాన్స్ బేస్ మీద…

18-20 కోట్ల మధ్యలో బిజినెస్ జరిగినట్లు బాలీవుడ్ ట్రేడ్ సమాచారం. ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు రానున్న క్రేజీ పాన్ ఇండియా మూవీస్ ముందు వరసలో రిలీజ్ కానున్న ఇండియన్2 ఇంకా ఎక్కువగానే బిజినెస్ ను అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు కానీ మొత్తం మీద 20 కోట్ల లోపు బిజినెస్ జరిగింది.

దాంతో హిందీలో ఇప్పుడు సినిమా ఓవరాల్ గా హిట్ అనిపించుకోవాలి అంటే 40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మినిమమ్ అందుకోవాల్సి ఉంటుంది. హిందీలో మొదటి పార్ట్ సక్సెస్ అయ్యి రెండో పార్ట్ బిజినెస్ పరంగా తక్కువ బిజినెస్ అందుకున్న సినిమా ఇండియన్2 అనే చెప్పాలి. ఇక హిందీలో ఈ సినిమాకి ఎలాంటి కలెక్షన్స్ సొంతం అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here