Home న్యూస్ తమిళ్ లో కన్నా తెలుగులో ఎక్కువ…ఇదేం విచిత్రం రా బాబు!!

తమిళ్ లో కన్నా తెలుగులో ఎక్కువ…ఇదేం విచిత్రం రా బాబు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పటి ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన భారతీయుడు (Bharateeyudu Movie) సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు2 (Bharateeyudu2 Movie) సినిమా… ఆడియన్స్ ముందుకు ఇప్పుడు భారీ లెవల్ లో శుక్రవారం రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో…

పర్వాలేదు అనిపించే లెవల్ లో బజ్ అయితే ఉందని చెప్పాలి. సినిమాకి ఆడియన్స్ నుండి మంచి టాక్ వస్తే కచ్చితంగా మంచి వసూళ్ళని అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా తెలుగు లో 24 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. 24 కోట్లు అంటే కొంచం మన దగ్గర…

టైర్2 హీరోల రేంజ్ బిజినెస్ అని చెప్పాలి. అలాంటి బిజినెస్ కి టికెట్ హైక్స్ పెట్టాలని ఎవరూ అనుకోరు, కానీ డబ్బింగ్ మూవీనే అయినా , బజ్ అంతగా లేకున్నా కూడా ఇప్పుడు భారతీయుడు2 సినిమాకి తెలుగు లో భారీ టికెట్ హైక్స్ ని పెట్టారు. ఆల్ మోస్ట్ క్రేజీ బిగ్ మూవీ రేంజ్ లో…

సింగిల్ స్క్రీన్స్ లో 225 వరకు రేటు ఉండగా మల్టిప్లెక్స్ లలో మాత్రం 300 ఆ పైన రేట్స్ ని పెట్టారు…ఆంధ్రలో రేట్స్ 200 రేంజ్ దాకా ఉన్నాయి…మనతో పోల్చితే తమిళనాడులో సినిమా చెన్నై లాంటి మేజర్ ఏరియాలో 195 వరకే ఉండగా ఓవరాల్ గా తమిళనాడు యావరేజ్ టికెట్ రేటు….

250 వరకే ఉంది…ఆ లెక్కన చూసుకుంటే తమిళ్ కన్నా కూడా తెలుగులోనే సినిమాకి టికెట్ హైక్స్ ఎక్కువగా ఉన్నాయి. లోకల్ క్రేజీ మూవీ అంటే రేటు ఎక్కువ ఉన్నా జనాలు చూస్తారని రేటు పెంచడం ఓకే కానీ ఇలా డబ్బింగ్ మూవీ కి కూడా భారీ రేట్స్ పెట్టడంతో…

సోషల్ మీడియాలో ఇప్పుడు టికెట్ హైక్స్ మీద ట్రోల్స్ గట్టిగానే పడుతున్నాయి ఇప్పుడు…మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకి అద్బుతమైన పాజిటివ్ టాక్ వస్తే హెల్ప్ అవుతుంది కానీ టాక్ ఏమాత్రం తేడా కొట్టినా కూడా భారీ దెబ్బలు పడే అవకాశం ఉంటుంది…మరి ఏమవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here