Home న్యూస్ 150వ సినిమా అంటున్నారు….పరువు పోయేలా ఉంది సామి!!

150వ సినిమా అంటున్నారు….పరువు పోయేలా ఉంది సామి!!

0

ప్రీ కోవిడ్ టైంలో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నా కూడా కోవిడ్ తర్వాత కంప్లీట్ ఫామ్ కోల్పోయిన బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక పోతున్నాయి…కొన్ని రీమేక్ లు సినిమాలు, అలాగే కొన్ని వీక్ సబ్జెక్ట్ సినిమాలు చేస్తూ…

వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా కూడా ఒకటి అరా సినిమాలు తప్పితే కోవిడ్ తర్వాత చేసిన సినిమాలు చాలా వరకు అట్టర్ ఫ్లాఫ్ అవ్వడంతో తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయిన అక్షయ్ కుమార్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సర్ ఫిరా(Sarfira Movie)తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు…

ఈ సినిమా తన కెరీర్ లో 150 వ సినిమాగా రూపొందిన సినిమా అని చెబుతూ ఉండగా డిజిటల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆకాశం నీ హద్దురా సినిమాకి రీమేక్ గా వస్తున్న సినిమా అవ్వడంతో అక్షయ్ కుమార్ ఈ సినిమాతో కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేస్తున్నాడు కానీ తన ప్రీవియస్ మూవీస్ రిజల్ట్ వలన….

   

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ను చూసిన తర్వాత టోటల్ బాలీవుడ్ ట్రేడ్ కి సైతం మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది….మినిమమ్ లో మినిమమ్ ఇంపాక్ట్ కూడా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో లేక పోవడంతో…

మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు….ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే మొదటి రోజు 5 కోట్లు వస్తే అదే చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది ఇప్పుడు…కానీ ట్రెండ్ అంతకన్నా కూడా చాలా తక్కువగా ఉండగా….

మొదటి రోజు సినిమాకి యునానిమస్ రెస్పాన్స్ వస్తే తప్పితే సినిమా తేరుకునే అవకాశం కనిపించడం లేదు, కెరీర్ లో 150 వ సినిమా అంటున్న సర్ ఫిరా మూవీ మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాకపోతే పరువు పోయే అవకాశం ఉందని చెప్పాలి. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here