Home న్యూస్ రికార్డులతో విరుచుకుపడిన ఇంద్రసేనుడు…కన్నడ గడ్డ మీద రికార్డ్!

రికార్డులతో విరుచుకుపడిన ఇంద్రసేనుడు…కన్నడ గడ్డ మీద రికార్డ్!

0
Indra4K Re Release Collections
Indra4K Re Release Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగిపోయిన రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో రీసెంట్ గా తిరిగి మొదలు అవ్వగా ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పుట్టిన రోజు కానుకగా ఇండస్ట్రీ హిట్ మూవీ ఇంద్ర(Indra4K Re Release) సినిమాను రీ రిలీజ్ చేయగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో దుమ్ము దుమారం లేపింది.

మొదటి రోజు ఇండియాలో ట్రాక్ చేసిన గ్రాస్ లెక్క 2 కోట్ల రేంజ్ కి చేరువ అవ్వగా ఓవర్సీస్ లో కూడా దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా ఇప్పుడు పక్క రాష్ట్రం కర్ణాటకలో సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మాస్ భీభత్సం సృష్టించింది… కాగా కర్ణాటకలో రిలీజ్ అయిన టాలీవుడ్…

రీ రిలీజ్ మూవీస్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన బిజినెస్ మాన్ మూవీ 27 లక్షలకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసింది….ఆ రికార్డ్ ఏడాదికి పైగా ఉండగా ఇప్పుడు మెగాస్టార్ ఇంద్ర మూవీ కర్ణాటకలో మొదటి రోజు ట్రాక్ చేసిన గ్రాస్ లెక్కనే ఏకంగా…

30 లక్షల మార్క్ ని దాటేసి ఓవరాల్ గా టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగానే కాదు ఏకంగా ఆల్ టైం రికార్డ్ రీ రిలీజ్ కలెక్షన్స్ ని కర్ణాటక లో మొదటి రోజు సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….మెగాస్టార్ కి కర్ణాటకలో ఎక్స్ లెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా…

ఇంద్ర మూవీ రిలీజ్ అయినప్పుడు అక్కడ సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు తిరిగి రీ రిలీజ్ లో కూడా ఇంద్ర మూవీ అక్కడ సంచలన రికార్డులు నమోదు చేయడం విశేషం అని చెప్పాలి….మొత్తం మీద పర్వాలేదు అనిపించేలా ఓపెనింగ్స్ వచ్చినా పెద్ద విషయమే అనుకుంటే ఏకంగా రికార్డుల జాతర సృష్టించింది ఇంద్ర మూవీ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here