టాలీవుడ్ లో ఒక టైం లో మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకరిగా నిలిచిన హీరో రవితేజ… ప్రతీ ఏడాది హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా మూడు నాలుగు సినిమాలు చేస్తూ వన్ మ్యాన్ ఆర్మీ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ హీరోగా దుమ్ము దులిపేశాడు. కానీ రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ కోసం కళ్ళు ఖాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు రవితేజ.
బెంగాల్ టైగర్ తర్వాత గ్యాప్ ఇచ్చి రాజా ది గ్రేట్ తో మంచి కంబ్యాక్ సొంతం చేసుకున్న మాస్ రాజా… తర్వాత నుండి వరుస ఫ్లాఫ్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు, నేల టికెట్, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ అంటోని లేటెస్ట్ గా డిస్కో రాజా సినిమాలు ఒకటికి మించి ఒకటి…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్స్ అవ్వగా ఇప్పుడు తన ఆశలన్నీ తన అప్ కమింగ్ మూవీ “క్రాక్” పైనే పెట్టుకున్నాడు రవితేజ. తాను ఇది వరకు ఫ్లాఫుల్లో ఉన్న టైం లో డాన్ శీను, బలుపు సినిమాలతో కంబ్యాక్ సాలిడ్ గా ఇచ్చేలా చేసిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా…
అన్ని అనుకున్నట్లు జరిగితే మే రెండో వారం లో ఆడియన్స్ ముందుకు రావాల్సింది. కానీ లాక్ డౌన్ వలన పోస్ట్ పోన్ అవ్వగా ఇన్ సైడ్ న్యూస్ నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా సాలిడ్ గా వచ్చిందని టాక్ ఉంది, హీరో క్యారెక్టర్ కానీ విలన్ గా చేసిన వరలక్ష్మీ రోల్ కానీ నువ్వా నేనా అన్నట్లు ఉంటుందని చెబుతున్నారు.
కథ పాయింట్ తమిళ్ మూవీ సేతుపతి ని పోలి కొద్ది వరకు ఉన్నా కమర్షియల్ హంగులు భారీ గా ఉన్నట్లు తెలుస్తుంది, ఈ న్యూస్ నిజం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రాజా సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా ఇప్పుడు జులై ఎండ్ లో వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది..