ప్రతీ ఇయర్ సమ్మర్ టైం లో నెలన్నర నుండి ఆల్ మోస్ట్ 2 నెలల పాటు జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి అందరికీ తెలిసిందే, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిన IPL రెండో సీజన్ మాత్రం ఎలక్షన్స్ వలన సౌత్ ఆఫ్రికా లో జరిగింది.
ఇక IPLT20 సరికొత్త ఎడిషన్ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే మొదలు అయ్యి మూడు వారాలు పూర్తీ అవ్వాల్సింది, చైనా నుండి వచ్చిన కరోనా ఎఫెక్ట్ టోటల్ ప్రపంచాన్నే అతలాకుతలం చేయగా ఇండియా లో కూడా అన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే.
కాగా ఇప్పటికి ఇప్పుడు ఈ టోర్నీ తిరిగి మొదలు అయ్యే అవకాశం చాలా తక్కువే అన్న వార్తలు వినిపిస్తుండగా BCCI మాత్రం ఇప్పుడు కుదరక పోయినా సెకెండ్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్ లో IPLT20 ని నిర్వహించాలని గట్టి ప్రయత్నాలు చేస్తుందని సమాచారం…
దీని కోసం ICC తో చర్చలు గట్టిగానే జరుపుతుందని అంటున్నారు. ఇది కనుక నిజం అయితే సెకెండ్ ఆఫ్ లో IPLT20 ఫుల్ సీజన్ కాకున్నా ఒక నెల రోజుల పాటు అయినా చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.