Home న్యూస్ సీడెడ్ గడ్డపై “ఇస్మార్ట్ శంకర్” ఊచకోత…MCA రికార్డ్ గల్లంతు!!

సీడెడ్ గడ్డపై “ఇస్మార్ట్ శంకర్” ఊచకోత…MCA రికార్డ్ గల్లంతు!!

0

కెరీర్ లో తొలి సారి గా చేసిన ఫుల్ లెంత్ మాస్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఊచకోత కోస్తున్నాడు. తొలి రోజు వసూళ్ళ పరంగా అన్ని సెంటర్స్ లో అంచనాలను మించి వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుండగా ముందుగా సీడెడ్ ఏరియాలో ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు తెలియ వచ్చాయి. ఇవి టాలీవుడ్ టాప్ స్టార్స్ తర్వాత స్టార్ హీరోల విషయం లో…

సరికొత్త రికార్డ్ గా చెప్పుకోవచ్చు. మొదటి రోజు ఏకంగా 1.21 కోట్ల షేర్ ని సీడెడ్ లో ఇస్మార్ట్ శంకర్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమం లో ఇది వరకు సీడెడ్ లో ఫస్ట్ డే రికార్డులు కొట్టిన నాని MCA సినిమా రికార్డ్ ను బ్రేక్ చేసింది ఇస్మార్ట్ శంకర్.

నాని MCA మొదటి రోజు సీడెడ్ లో 1.12 కోట్ల షేర్ ని సాధించి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ లీగ్ 2 హీరోల విషయం లో సరికొత్త బెంచ్ మార్క్ గా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన ఇస్మార్ట్ శంకర్ మిగిలిన హీరోలకు ఇప్పుడు సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి పెట్టింది అని చెప్పొచ్చు. ఇక మిగిలిన ఏరియాల వసూళ్ళ వివరాలు తెలియాల్సి ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here