Home న్యూస్ రవితేజ చేయాల్సిన జాట్ మూవీ ట్రైలర్ రివ్యూ…ఎలా ఉందంటే!!

రవితేజ చేయాల్సిన జాట్ మూవీ ట్రైలర్ రివ్యూ…ఎలా ఉందంటే!!

0

ఒకరు చేయాల్సిన సినిమాలు మరో యాక్టర్స్ చేయడం అన్నది ఎప్పటి నుండో ఉన్నదో…బడ్జెట్, రెమ్యునరేషన్ లేదా ఇతర కారణాలు ఏవైనా కావోచ్చు…ఒకరితో అనుకున్న సినిమాలు మరొకరితో అవ్వడం సహజంగా జరుగుతూ ఉంటుంది…లేటెస్ట్ గా టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ(Raviteja)తో గోపీచంద్ మలినేని…

డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా ఒకటి బడ్జెట్ ఇష్యూల వలన రవితేజ నుండి బాలీవుడ్ లో గదర్2 సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న సీనియర్ హీరో సన్నీ డియోల్ చేతికి వెళ్ళింది. ఆ సినిమాకి జాట్ అనే టైటిల్ ను కన్ఫాం చేయగా…

వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత ఓ పక్కా కమర్షియల్ టాలీవుడ్ మూవీ లో మెయిన్ లీడ్ మన హీరో కాకుండా ఓ బాలీవుడ్ హీరోని పెట్టినట్లు అనిపించింది అని చెప్పాలి.

ఆల్ మోస్ట్ తెలుగు రాష్ట్రాలలోనే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో అడుగడుగునా తెలుగు యాక్టర్స్..తెలుగు బోర్డ్స్ కనిపించగా….రవితేజ ప్లేస్ లో సన్నీ డియోల్ ఊరమాస్ ఎలివేషన్స్ తో రచ్చ చేసినట్లు అనిపించింది. మాస్ సీన్స్…ఎలివేషన్ లు….కమర్షియల్ ఎలిమెంట్స్ తో…

నిండిపోయిన సినిమా ట్రైలర్ బాలీవుడ్ వాళ్ళకి కొంచం డిఫెరెంట్ గా అనిపించవచ్చు ఏమో కానీ తెలుగు ఆడియన్స్ కి మాత్రం రొటీన్ గానే అనిపించి ఉండొచ్చు అని చెప్పాలి. కానీ సన్నీ డియోల్ ని మాత్రం ఓ రేంజ్ లో పవర్ ఫుల్ రోల్ లో చూపించబోతున్నట్లు ట్రైలర్ లో కన్ఫాం అవ్వగా…

గోపీచంద్ మలినేని హీరో ఎలివేషన్ లు, డీసెంట్ స్క్రీన్ ప్లే తో పర్వాలేదు అనిపించే స్టోరీ లైన్ ని తీసుకుని బాగానే సినిమాను తీశాడని ట్రైలర్ చూస్తె అనిపిస్తుంది. ఇక రవితేజ చేయాల్సిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here