Home న్యూస్ జగమే తంత్రం రివ్యూ…హిట్టా-ఫ్లాఫా….దిమ్మతిరిగిపోయింది!

జగమే తంత్రం రివ్యూ…హిట్టా-ఫ్లాఫా….దిమ్మతిరిగిపోయింది!

0

ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ అయిపోయి వరుస పెట్టి సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ ని కన్ఫాం చేసుకుంటున్న కానీ ఒక సినిమా మాత్రం థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది. దాంతో అందరూ ఇలాంటి నిర్ణయం పై ఆశ్యర్యపోయారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాని చూసిన తర్వాత డిజిటల్ రిలీజ్ చేసి మంచి పని చేశారు అనిపించింది…

ఆ సినిమానే ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ జగమే తంత్రం… పేట తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ధనుష్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే మదురై లో లోకల్ దాదా అయిన హీరో ఒక మర్డర్ తర్వాత జరిగిన పరిస్థితుల వలన ఓ 30 రోజులు అండర్ గ్రౌండ్ వెళ్లాలని చూస్తాడు. సరిగ్గా అదే టైం లో తమిళ్ తెలిసి తెగించి ముందుకు వెళ్ళే ఓ గుండా కోసం చూస్తున్న లండన్ డాన్…

హీరో గురించి తెలిసి లండన్ కి రప్పిస్తాడు. అసలు లండన్ కి రప్పించడానికి రీజన్ ఏంటి, లండన్ వచ్చాక హీరో ఏం చేశాడు. తర్వాత ఏం జరిగింది లాంటివి అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా ధనుష్ ఈ సినిమాను నిలబెట్టడానికి అడుగడుగునా కష్ట పడ్డాడు అని చెప్పాలి. కానీ కథలో దమ్ము లేకుండా పోయింది.

అయినా సినిమా మొత్తం ధనుష్ వన్ మ్యాన్ షో గా చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా తన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక్కటి హార్ట్ టచింగ్ లా అనిపించినా ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత సినిమా మళ్ళీ ఫ్లాట్ గా మారిపోతుంది. ఇక ఇతర యాక్టర్స్ కూడా జస్ట్ ఓకే అనిపించుకున్నారు.

సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ జస్ట్ యావరేజ్ గా ఉండగా కొన్ని చోట్ల మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించింది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ రొటీన్ గా చాలా లెంతీ గా అనిపించింది. ఫస్టాఫ్ వరకు ఎలాగోలా పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ మాత్రం కంప్లీట్ గా ట్రాక్ తప్పి రొటీన్ నరేషన్ తో ప్రిడిక్టబుల్ సీన్స్ తో సరిపోయింది సినిమా మొత్తం….

సినిమాటోగ్రఫీ బాగుండగా లోకేషన్స్ ని బాగానే చూపెట్టారు. ఇక తెలుగు డబ్బింగ్ అండ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను కబాలి ఎక్స్ టెండెడ్ వర్షన్ లా తెరకెక్కించాడు అనిపించింది. సేం కబాలి ని పోలి ఉన్న కథ అడుగడుగునా….

అలాగే సాగుతూ కబాలి లానే బోర్ కొట్టింది, కబాలి అయినా సీరియస్ నోట్ తో సాగుతుంది కానీ ఇక్కడ అటు సీరియస్ కాకుండా ఇటు కమర్షియల్ కాకుండా మధ్యలోనే ఇరుక్కుపోయింది ఈ సినిమా. దానికి తోడూ తెలుగు బుజ్జిగాడు సినిమాను పోలి కొన్ని సీన్స్ ఉన్నాయి.

దానికి తోడూ ఓ పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూని ఇందులో చెప్పాలని ట్రై చేశారు కానీ అది ఆడియన్స్ కి ఏమాత్రం కనెక్ట్ అయ్యేలా తీయలేక పోయారు. దాంతో సెకెండ్ ఆఫ్ కంప్లీట్ గా ట్రాక్ తప్పింది, ఎంత ట్రై చేసినా తిరిగి ట్రాక్ ఎక్కలేదు, ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవ్వలేక పోయింది. ఓవరాల్ గా జగమే తంత్రం సినిమా ఫస్టాఫ్ వరకు ఓకే అనిపించినా…

సెకెండ్ ఆఫ్ నిరుత్సాహపరిచింది. కమర్షియల్ టచ్ ఉన్న కొన్ని సీన్స్ తప్పితే ఓవరాల్ గా ఈ గ్యాంగ్ స్టర్ మూవీ రీసెంట్ టైం లో ధనుష్ కెరీర్ లో వీకేస్ట్ మూవీ గా నిలిచిన సినిమా అని చెప్పాలి. ఇక కచ్చితంగా సినిమా చూసి తీరాల్సిసిందే అంటే ఓపిక చేసుకుని 2 గంటల 40 నిమిషాల లెంత్ ఉన్న ఈ మూవీని చూడొచ్చు, లేదంటే OTT లో ఈ సినిమా కన్నా బెటర్ మూవీస్ చాలానే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here