Home గాసిప్స్ 55 అనుకుంటే 60 అయ్యింది…ఇప్పుడు ఎంత లాస్ వచ్చిందో తెలిస్తే మైండ్ బ్లాంక్!

55 అనుకుంటే 60 అయ్యింది…ఇప్పుడు ఎంత లాస్ వచ్చిందో తెలిస్తే మైండ్ బ్లాంక్!

0

థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే సినిమాల రిజల్ట్ లు తేడా కొడితే ఆ సినిమాల నష్టాలు ఎంత అనేది ఇక ఈజీగా అందరికీ తెలిసి పోతుంది, కానీ థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ లను సొంతం చేసుకునే సినిమాల విషయం లో లెక్కలు ఏవి కూడా అంత క్లియర్ గా బయటికి రావు, సినిమాలకి ఎంత వ్యూవర్ షిప్ వచ్చింది లాంటివి కూడా తక్కువ సందర్భాలలోనే….

బయటికి చెబుతూ ఉంటారు… కానీ కొన్ని సినిమాలు అప్పుడప్పుడు భారీ ఎదురు దెబ్బలు కొట్టి నష్టాలను మిగిలిస్తాయి OTT వాళ్లకి, ఇప్పుడు ఆ కోవలోకే చేరే కొత్త సినిమా ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ జగమే తంత్రం సినిమా. ఈ సినిమా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో…

డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరి నుండి నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, అయినా కానీ ఫస్ట్ డే మట్టుకు నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతూ సాలిడ్ గానే వ్యూస్ వచ్చాయి అని చెప్పగా తర్వాత నుండి…

సినిమా వ్యూవర్ షిప్ కంప్లీట్ గా పడిపోయింది అంటున్నారు. ఇంతలో సినిమా మాస్టర్ ప్రింట్ కూడా ఆన్ లైక్ లోకి వచ్చేయడంతో జనాలు ఎక్కువ శాతం నెట్ ఫ్లిక్స్ రేట్లు కట్టలేరు కాబట్టి పైరసీనే చూశారు, అది కూడా ఎఫెక్ట్ గా మారి సినిమా కి ఇప్పుడు భారీ నష్టాలనే వచ్చేలా చేసిందని అంటున్నారు. ముందు నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సినిమాను ఫైనల్ గా…

55 కోట్ల రేటుకి కొందాం అనుకున్నా మేకర్స్ రేటు పెరిగేలా చేసి 60 కోట్లకి ఫైనల్ గా రేటు ఫిక్స్ చేయగా ఇప్పటి వరకు వచ్చిన వ్యూవర్ షిప్ వలన 30 కోట్ల రేంజ్ వరకు మాత్రమే రికవరీ అయ్యిందని కోలివుడ్ ట్రేడ్ లో చెబుతున్నారు. అంటే ఈజీగా నెట్ ఫ్లిక్స్ కి సగం వరకు నష్టాలు కన్ఫాం అయినట్లేనని చెబుతున్నారు. ఇది నిజం అయితే నెట్ ఫ్లిక్స్ కి ఇది సాలిడ్ ఎదురు దెబ్బ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here