Home గాసిప్స్ డెవిల్ లుక్ అదిరిపోయింది…పాన్ ఇండియా మూవీ కి సెన్సేషనల్ బడ్జెట్!

డెవిల్ లుక్ అదిరిపోయింది…పాన్ ఇండియా మూవీ కి సెన్సేషనల్ బడ్జెట్!

1796
0

నందమూరి కళ్యాణ్ రామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైం లో ఎంత మంచి వాడవురా అంటూ వచ్చి ఆడియన్స్ ను ఏమాత్రం అలరించలేక పోయాడు. దాంతో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచింది, ఆ డిసాస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను తన పుట్టిన రోజు టైం లో అనౌన్స్ చేసి మంచి కిక్ ఇచ్చాడు.

తన కొత్త సినిమాల్లో బింబిసర ఆల్ రెడీ మంచి బజ్ ని క్రియేట్ చేయగా ఆ సినిమా రేంజ్ లోనే మరో సినిమా ఇప్పుడు అంచనాలను పెంచేస్తుంది అని చెప్పాలి. కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఈ సరికొత్త సినిమా కి “డెవిల్- ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్” అంటూ…

పవర్ ఫుల్ టైటిల్ ని కన్ఫాం చేశారు. దాంతో పాటు సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. దాంతో సినిమా పై ఆడియన్స్ లో ఇన్స్టంట్ గా అంచనాలు సాలిడ్ గా పెరిగి పోయాయి. అంతటితో ఆగకుండా సినిమా ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న…

భారీ బడ్జెట్ మూవీ అని తేల్చేశారు… ట్రైల్ షూట్ జరిగిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ అదిరిపోయే విధంగా ఉండగా బ్రిటిష్ కాలంలో ఓ సీక్రెట్ ఏజెంట్ లా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో నటించబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం మరో సారి తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ని పెట్టబోతున్నారట. ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ బడ్జెట్ తో…

ఈ సినిమా నిర్మాణం కాబోతుందని అంటున్నారు, సినిమా కోసం భారీ సెట్టింగ్ లు కూడా ఉండబోతున్నాయని సమాచారం, బ్రిటిష్ కాలం నాటి సినిమా అంటూ ఉండటం అప్పటి టైం తాలుకూ సెట్స్ ని డిసైన్ చేస్తున్నారట. బాక్ టు బాక్ అద్బుతమైన సినిమాలను కమిట్ అవుతున్న కళ్యాణ్ రామ్ రానున్న 2 ఏళ్లలో కెరీర్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here