Home న్యూస్ జై భజరంగి మినీ రివ్యూ…సినిమా ఎలా ఉందంటే!!

జై భజరంగి మినీ రివ్యూ…సినిమా ఎలా ఉందంటే!!

0

రీసెంట్ గా అర్ధాంతరంగా కన్ను మూసిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు చివరి సారిగా అటెండ్ అయిన ఈవెంట్ తన అన్న అయిన శివరాజ్ కుమార్ గారి లేటెస్ట్ మూవీ భజరంగి 2… ఈ సినిమా రిలీజ్ రోజునే యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి జిమ్ చేస్తూ హార్ట్ స్ట్రోక్ వలన అర్ధాంతరంగా కన్ను మూశారు… అదే రోజు రిలీజ్ అయిన జై భజరంగి మూవీ కన్నడలో…

హీరో మరణ వార్తాతో థియేటర్స్ అన్నీ మూతబడ్డాయి… తెలుగు లో సజావుగానే సినిమా రిలీజ్ అవ్వగా సినిమా గురించి తెలుగు ఆడియన్స్ కి పెద్దగా ఏమి తెలియదు… 2013 లో వచ్చిన భజరంగి కన్నడలో భారీ హిట్ అవ్వగా ఆ సినిమా సీక్వెల్ అంటూ జై భజరంగి తీసినా కంప్లీట్ గా కొత్త కథతో…

ఈ సినిమాను తెరకెక్కించారు… కథ ఏంటంటే…. ఏజ్ అవుతున్న పెళ్లి కాని హీరో అక్కని ఆమె ఫ్యామిలీని అరుదైన మూలికలతో మత్తు మందులు తయారు చేసే మాఫియా ముఠా కిడ్నాప్ చేస్తారు…ఏం చేయాలని స్థితిలో హీరో సూసైడ్ చేసుకుంటాడు… అప్పుడు హీరో బాడీ లో…

ఒక ఆత్మ వస్తుంది, ఆ ఆత్మ బాడీలో వచ్చిన తర్వాత ఏం చేసింది అన్నది అసలైన కథ…. హీరో శివరాజ్ కుమార్ తన ఏజ్ కి మించి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమాలో స్టార్ కాస్ట్ చాలా పెద్దదిగా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాఫిక్స్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా అవి ఆకట్టుకున్నా కానీ కథ అనేది పెద్దగా బలంగా లేక పోవడంతో….

సినిమా ఏ దశలో కూడా ఆకట్టుకోలేదు, లెంత్ కూడా ఎక్కువ అయ్యి బోర్ కొట్టిస్తుంది… సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా సినిమా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ గ్రాఫిక్స్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది. సినిమా ఫస్ట్ పార్ట్ అక్కడ మంచి హిట్ గా నిలిచింది కానీ రెండో పార్ట్ ఓవరాల్ ఆ రేంజ్ లో లేదు కానీ పర్వాలేదు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here