Home టోటల్ కలెక్షన్స్ ఎన్టీఆర్ జైలవకుశ టోటల్ కలెక్షన్స్…ఎన్టీఆర్ కొట్టాడు కానీ!!!

ఎన్టీఆర్ జైలవకుశ టోటల్ కలెక్షన్స్…ఎన్టీఆర్ కొట్టాడు కానీ!!!

0
Jailavakusa Total WW Collections
Jailavakusa Total WW Collections

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి మూడు వరుస విజయాల తర్వాత వచ్చిన సినిమా అవ్వడం తో స్కై హై ఎక్స్ పెర్టేషన్స్ తో రిలీజ్ అవ్వగా మొదటి రెండు వారాల్లో దుమ్ము లేపే వసూళ్లు సాధించింది.. కానీ తర్వాత అనుకున్న రేంజ్ లో వసూళ్లు రాలేదు. దానికి కారణాలు సినిమాకు 6 వ రోజు నుండే మొదలైన తీవ్ర పోటి.

వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం టాక్ బాగుండటం తో జైలవకుశ థియేటర్స్ ఆ సినిమాలకు వెళ్ళడం జరిగింది. దాంతో టికెట్ హైక్స్ తగ్గి సామాన్య రేటుకి వచ్చేయగా కొత్త సినిమాల పోరు వల్ల జైలవకుశ కలెక్షన్స్ తగ్గాయి. కానీ ఎన్టీఆర్ సినిమాకు రిపీట్ ఆడియన్స్ బాగానే చూశారు అని చెప్పొచ్చు.

కానీ మధ్యలో GST కూడా ఎదురుదెబ్బ కొట్టగా మొత్తం మీద 7 కోట్లకు పైగానే సినిమా నష్టపోవాల్సి వచ్చింది. అదే సినిమా కి ఫైనల్ టాగ్ ని డిసైడ్ చేయడంలో ఎదురుదెబ్బ కొట్టింది. మొత్తం మీద సినిమా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండీ…

నైజాం—17.15 కోట్లు
సీడెడ్—12.35 కోట్లు
వైజాగ్—7.3 కోట్లు
ఈస్ట్—-5.96 కోట్లు
వెస్ట్—-4.06 కోట్లు
కృష్ణా—4.95 కోట్లు
గుంటూరు—6.36 కోట్లు
నెల్లూరు—2.7 కోట్లు
మొత్తం రెండు రాష్ట్రాల కలెక్షన్స్—-60.83 కోట్లు
కర్ణాటక—8.92 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా—2.3 కోట్లు
టోటల్ ఓవర్సీస్—-9.4 కోట్లు
మొత్తం కలెక్షన్స్—-20.62 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్——81.50 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్—–145 కోట్లు

ఇదీ సినిమా టోటల్ గా ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్…కొన్ని చిన్న ఏరియాలలో రిపోర్టింగ్ కొద్దిగా బాలెన్స్ ఉండగా ఆ కలెక్షన్స్ కూడా కలుపుకుని సినిమా 81.5 కోట్ల షేర్ ని అందుకుందని చెప్పొచ్చు. సినిమా మొత్తంగా 30 కోట్ల లోపే బడ్జెట్ తో తెరకెక్కగా….

టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 85 కోట్లవరకు చేసింది. సినిమా టోటల్ రన్ లో 81.5 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా 3.5 కోట్ల మేర నష్టపోయింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్ గా నిలిచిందని చెప్పొచ్చు. అదే సినిమాకు GST కనుక అడ్డు లేకుంటే ఈపాటికే 88 కోట్లకు పైగా షేర్ ని అందుకునేది.

కానీ GST వల్ల నష్టపోయిన ఈ సినిమా కి కొత్త సినిమాల పోరు కూడా గట్టిగానే తాకడం తో ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ 80 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టినా బ్రేక్ ఈవెన్ కి చేరువ అయినా ఆ లైన్ ని క్రాస్ చేయలేకపోయింది. కానీ ఇంత పోటి లో ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని ఎన్టీఆర్ పేరు మీద సినిమా ఈ రేంజ్ వసూళ్లు సాధించడం బాక్స్ ఆఫీస్ విజయాన్ని మించిన గెలుపు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here