Home న్యూస్ 7 రోజుల్లో విక్రమ్ ఔట్…రజినీ దెబ్బకి రికార్డులు గల్లంతు!

7 రోజుల్లో విక్రమ్ ఔట్…రజినీ దెబ్బకి రికార్డులు గల్లంతు!

0

కోలివుడ్ సీనియర్ హీరోలలో చాలా కాలం హిట్ కి దూరంగా ఉన్న హీరో కమల్ హాసన్(Kamal Haasan) చాలా చాలా ఏళ్ల తర్వాత లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర విక్రం(Vikram Hit List) మూవీతో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవడమే కాదు తమిళ్ లో ఇండస్ట్రీ రికార్డులను…

తిరగరాసి సంచలనం సృష్టించింది. టోటల్ రన్ లో ఈ సినిమా లాంగ్ రన్ ని సొంతం చేసుకుని 400 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ సినిమా టోటల్ రన్ లో సాధించిన ఎపిక్ కలెక్షన్స్ ని ఇప్పుడు…

Vikram 26 Days Total World Wide Collections!!

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) రీసెంట్ టైంలో పెద్దగా ఫామ్ లో లేక పోయినా కానీ జైలర్(Jailer Movie) లాంటి నార్మల్ మూవీతో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మొదటి వారంలోనే విక్రమ్ టోటల్ రన్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది.

విక్రమ్ మూవీ టోటల్ రన్ లో 417.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ మొదటి వారంలో 425 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని విక్రమ్ మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది.

రజినీ ఒక నార్మల్ మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోయగా రెండో వారంలో పెద్దగా పోటి ఏమి లేక పోవడంతో సినిమా లాంగ్ రన్ లో కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగి ఊహకందని ఊచకోత కోసే లాభాలతో దుమ్ము లేపడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పాలి ఇప్పుడు.

Jailer Movie 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here