మలయాళం లో తెరకెక్కిన మూవీస్ చాలా వరకు డిఫరెంట్ గా ఉంటాయి, ఇక ఇప్పటి వరకు రాని కాన్సెప్ట్ తో వాళ్ళు చేసిన ప్రయత్నం జల్లికట్టు, ఆదిమానవుల నుండి మామూలు మనుషులుగా మనం మారినా ఎక్కడో మన లో జంతువులను వేటాడే మృగం ఉన్నాడు అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అద్బుతమైన ప్రశంసలను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సౌండింగ్ ఇప్పటి వరకు మనం విని ఉండం అనే చెప్పాలి.
డిఫెరెంట్ కాన్సెప్ట్, యూనిక్ సౌండింగ్ తో అల్టిమేట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మలయాళం నుండి రీసెంట్ గా తెలుగు లో డబ్ అయ్యి ఆహా వీడియో లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే, ఆల్ మోస్ట్ 3 వారలాను పూర్తీ చేసుకున్న ఈ సినిమా…
తెలుగు డబ్బింగ్ బిజినెస్ అండ్ ఆహా వీడియో లో సినిమాకి ఎన్ని యూనిక్ వ్యూస్ వచ్చాయి అన్నది ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతుంది, ఆ లెక్కల ప్రకారం సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని సుమారు 1.6 కోట్ల దాకా రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారట ఆహా వీడియో వాళ్ళు..
ఇక డబ్బింగ్ పనులను మరో 15 లక్షల దాకా ఖర్చు చేయగా సినిమా మొత్తం మీద మొదటి వారం లో ఆహా యాప్ లో 90 వేల వ్యూస్ ని సొంతం చేసుకుందట. తర్వాత మూడు వారాలు పూర్తీ అయ్యే సరికి 1 లక్షా 46 వేల దాకా యూనిక్ వ్యూస్ ని ఈ సినిమా తెలుగు లో సొంతం చేసుకుందని అంటున్నారు.
ఆహా యాప్ ఒక నెల రేటు 50 అనుకుంటే అదే సినిమా టికెట్ రేటుగా భావిస్తే… 1.46 లక్షల యూనిక్ వ్యూస్ కి 73 లక్షల దాకా రెవెన్యూ వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం సినిమా ఇంకా చాలా అమౌంట్ ని తెలుగు లో రికవరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.