కొన్ని కొన్ని సినిమాలు కొందరికే నచ్చుతాయి, కొన్ని సినిమాలు కథల పరంగా కొత్తగా ఉన్నా అవి అందరికీ ఎక్కవు, ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు అన్ని భాషలలో వచ్చిన సినిమాల్లో యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు కొన్ని ఉండగా అసలు ఎక్స్ పెర్ట్ చేయని కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా గా మలయాళం సినిమా జల్లికట్టు గురించి చెప్పుకోవాలి. సినిమాను మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే విమర్శించిన వాళ్ళు ఉన్నారు.
సౌండింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఓవరాల్ కాన్సెప్ట్ విషయంలో సినిమా చూసి బాగానే మెచ్చుకున్నారు, అలాగే ఒక అడవి దున్నని తినడానికి జనాలు ఇంత పిచ్చోళ్ళు అవుతారా అని ఇదేమి పిచ్చి సినిమా రా బాబు అని కూడా విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు.
కానీ ఇప్పుడు ఈ సినిమానే ఇండియా నుండి అఫీషియల్ గా ఆస్కార్ రేసులో నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది, చాలా సినిమాలు పరిశీలించి చివరగా ఈ సినిమాను ఆస్కార్ కి ఫారన్ మూవీ క్యాటగిరీ లో పంపించబోతున్నారట. మలయాళంలో ఈ ఇయర్ మొదట్లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా మ్యాజిక్ చేయలేదు కానీ…
కాన్సెప్ట్ కి సినిమా టేకింగ్ కి ఓ రేంజ్ లో మంచి రెస్పాన్స్ ను తర్వాత సోషల్ మీడియా లో విపరీతమైన హైప్ ని సొంతం చేసుకోగా సబ్ టైటిల్స్ తోనే సినిమాను ఆల్ ఇండియా వైడ్ గా విరగబడి చూశారు. ఇక ఈ సినిమాను అదే పేరుతో తెలుగు లో ఆహా వీడియో లో డబ్ చేసి రిలీజ్ చేయగా…
ఇక్కడ రెస్పాన్స్ ఏమంత పాజిటివ్ గా అయితే రాలేదు, మనదగ్గర ఈ సినిమా చూసిన ఎక్కువ శాతం జనాలు ఇదేమి సినిమా రా అంటూ తిట్టుకున్నారు కూడా, కానీ ఇప్పుడు ఇండియా తరుపున అఫీషియల్ ఆస్కార్ బరిలో నిలిచిన ఈ సినిమా ఇక్కడ చేసినట్లు అక్కడ ఏమైనా అద్బుతాలు చేస్తుందా త్వరలోనే తెలుస్తుంది…