నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 50 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి ఇప్పుడు 60 కోట్ల వైపు దూసుకు పోతూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఈ ఇయర్ కి గాను ఓ రేర్ రికార్డ్ ను…
సమం చేసే అవకాశాన్ని జస్ట్ లో మిస్ అయ్యింది… రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో వరుస పెట్టి ప్రతీ రోజూ 1 కోటి కి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకున్న సినిమాలు చాలా తక్కువే ఉన్నాయి. మంచి బజ్ ఉన్న సినిమాలు కూడా…
తక్కువే రిలీజ్ అవ్వడం లాంటివి కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. మొత్తం మీద రిలీజ్ అయిన మూవీస్ పరంగా చూస్తె ఈ ఇయర్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సంచలన కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన సినిమా జాతిరత్నాలు ఏకంగా 12 రోజులు వరుసగా కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక తర్వాత ప్లేస్ లో మరో చిన్న సినిమా టు నేషనల్ వైడ్ డెబ్యూ మూవీ రికార్డ్ కలెక్షన్స్ హోల్డర్ ఉప్పెన సినిమా వరుసగా 11 రోజుల పాటు 1 కోటికి తగ్గకుండా షేర్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక మూడో ప్లేస్ లో ఇప్పుడు బాలయ్య అఖండ మూవీ 11 రోజుల పాటు 1 కోటికి తగ్గకుండా షేర్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది.
ఇక క్రాక్ సినిమా 10 రోజులు, వకీల్ సాబ్ 10 రోజులు కోటికి తగ్గకుండా షేర్స్ ని అందుకోగా అఖండ సినిమా 12 వ రోజు కోటికి పైగా షేర్ ని సొంతం చేసుకుంటుంది అని అంతా అనుకున్నారు కానీ సినిమా కొంచం ఎక్కువగానే డ్రాప్ అయ్యి జాతిరత్నాలు సినిమా రికార్డ్ ను అందుకోలేక పోయింది. ఇక పుష్ప వచ్చే వారం రిలీజ్ కానుంది కాబట్టి ఈ రికార్డ్ కొట్టే ఛాన్స్ ఆ సినిమాకే ఉంది.