Home న్యూస్ జాతిరత్నాలు రివ్యూ…రేటింగ్…ఫస్టాఫ్ కుమ్మింది…సెకెండ్ ఆఫ్??

జాతిరత్నాలు రివ్యూ…రేటింగ్…ఫస్టాఫ్ కుమ్మింది…సెకెండ్ ఆఫ్??

0

మహా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీస్ లో సెన్సేషనల్ హైప్ ను సొంతం చేసుకున్న సినిమా జాతిరత్నాలు. చిన్న సినిమానే అయినా అల్టిమేట్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ అంచనాలను ఎంతవరకు తట్టుకుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ పాయింట్ కి వస్తే…. ఊర్లో లేడీస్ ఎంపోరియంలో పనిచేసే హీరో ఆ జాబ్ నచ్చక…

హైదరాబాదు కి వస్తాడు, తన ఫ్రెండ్స్ తో కలిసి ఉంటాడు, అనుకోకుండా వీళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, అసలు జైలు ఎందుకు వెళ్ళారు, వీళ్ళు చేసిన క్రైం ఏంటి, మరి జైలు నుండి ఎలా బయట పడ్డారు లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ చాలా చాలా సింపుల్ స్టొరీ పాయింట్, కానీ డైరెక్టర్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు.

ముఖ్యంగా ఫస్టాఫ్ హిలేరియస్ కామెడీ తో సింగిల్ లైన్ పంచులతో ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తుంది, అబ్బ అదిరిపోయిందిగా సినిమా అనుకుంటూ ఉంటె సెకెండ్ ఆఫ్ మొదలు అవ్వడం, డ్రాగ్ అవ్వడం, ఫస్టాఫ్ రేంజ్ లో కామెడీ వర్కౌట్ అవ్వకపోవడంతో సెకెండ్ ఆఫ్ యావరేజ్ గా ఉందనిపిస్తూ సినిమా ముగుస్తుంది… ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే…

నవీన్ పాలిశెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పాలి, తన కామిక్ టైమింగ్ కానీ, యాక్టింగ్ కానీ ఫ్రెష్ గా మెప్పిస్తాయి, నవీన్ కి ఇటు ప్రియదర్శి అటు రాహుల్ రామకృష్ణ ఇద్దరూ బాగా హెల్ప్ అయ్యారు, ఇక హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకోగా మిగిలిన నటీనటులు కూడా మెప్పించారు, సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా మెప్పించాయి.

ఆల్ రెడీ చిట్టి సాంగ్ సూపర్ హిట్ అవ్వగా థియేటర్ లో రెస్పాన్స్ మరో లెవల్ లో ఉంటుంది, ఇక జాతిరత్నాలు సాంగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ అడిరిపోయినా సెకెండ్ ఆఫ్ స్లో అవుతూ నరేషన్ ఉంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా చిన్న సినిమానే అయినా క్వాలిటీ అదిరిపోతుంది. ఇక డైరక్షన్ విషయానికి వస్తే..

అనుదీప్ చాలా చిన్న స్టొరీ పాయింట్ ని ఎంచుకుని ఫస్టాఫ్ వరకు అంచనాలను మించినా సెకెండ్ ఆఫ్ ఫస్టాఫ్ ఆఫ్ పెంచిన అంచనాలను అందుకోలేక పోయాడు, అలా అనీ పూర్తిగా నిరాశ పరచలేదు కానీ ఫస్టాఫ్ రేంజ్ లో సెకెండ్ ఆఫ్ ఉండి ఉంటే సినిమా లెక్క మరో రేంజ్ లో ఉండి ఉండేది. అయినా కానీ మొత్తం మీద ఈజీగా జాతిరత్నాలు సినిమాను..

ఒకసారి చూసి ఎంజాయ్ చేయోచ్చు, ఫస్టాఫ్ ఇచ్చిన ఎంటర్ టైన్ మెంట్ తో సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయినా క్లైమాక్స్ చాలా సింపుల్ గా ముగిసినా మొత్తం మీద థియేటర్స్ నుండి బయటికి వచ్చేవాళ్ళు సినిమా బాగుంది అని చెప్పడం ఖాయం. టోటల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్…. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here