బాక్స్ ఆఫీస్ దగ్గర హీరోగా చేసిన మొదటి సినిమాతో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు, టాలెంటెడ్ యాక్టర్ నివిన్ పాలిశెట్టి… ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా తో సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకున్న నివిన్ పాలిశెట్టి… బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా తర్వాత చేస్తున్న సినిమా జాతిరత్నాలు, ఈ సారి రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి తో కలిసి చేస్తున్న ఈ కామెడీ మూవీ కి మంచి హైప్ ఉంది…
సినిమా చిన్న సినిమానే అయినా కానీ ఆడియన్స్ లో ముఖ్యంగా యూత్ లో ఫుల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బిజినెస్ పరంగా సినిమా రేంజ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. కాగా సినిమా బడ్జెట్ వివరాలు ఇంకా రివీల్ కాలేదు కానీ…
తక్కువ లోనే నిర్మించిన ఈ సినిమా క్రేజ్ సాలిడ్ గా ఉండటం తో ఆంధ్రా రీజన్ లో 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుందని అంటున్నారు, కంప్లీట్ ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా బిజినెస్ ఆఫర్ల్రు 8 కోట్ల రేంజ్ లో ఉన్నాయని ట్రేడ్ లో టాక్ ఉంది. ఇక సినిమా కు…
నైజాం ఏరియా లోనే 4 కోట్ల రేంజ్ లో ఆఫర్లు వస్తున్నాయట. అంటే ఇవే కన్ఫాం అయినా మొత్తం మీద 12 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకోవచ్చు అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. కానీ నిర్మాతలు కొన్ని మెయిన్ సెంటర్స్ లో సినిమాను ఓన్ గా రిలీజ్ చేయాలనీ ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.
మరి అది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా మొత్తం మీద సినిమా బిజినెస్ పరంగానే సంచలనాలను సృష్టిస్తూ దూసుకు పోతుంది అని చెప్పాలి, ఇక మార్చ్ 11 న మహా శివరాత్రి కానుకగా రిలీజ్ అవుతున్న సినిమాల్లో సడెన్ గా హాట్ ఫేవరేట్ మూవీ గా మారిన ఈ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుందో చూడాలి ఇక..