బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి కానుకగా ఏకంగా 4 సినిమాలు రిలీజ్ కి సిద్ధం అయ్యాయి, వాటిలో మూడు తెలుగు సినిమాలు కాగా మరోటి కన్నడ డబ్బింగ్ మూవీ, ఇక నాలుగు సినిమాలు కూడా వేటికవే డిఫెరెంట్ జానర్ మూవీస్ కాగా నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తాయి అన్నది ఆసక్తిగా మారగా అన్ని సినిమాల అఫీషియల్ బిజినెస్ లెక్కలు బయటికి వచ్చేశాయి. ఒకసారి ఆ లెక్కలను గమనిస్తే…
ముందుగా శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని సినిమాల లోకి హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది, మొత్తం మీద 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ కోసం 17.5 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది.
ఇక అనిల్ రావిపూడి నిర్మాణంలో శ్రీ విష్ణు రాజేంద్రప్రసాద్ ల కాంబినేషన్ లో రూపొందిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా గాలి సంపత్ కి మొత్తం మీద 6.5 కోట్ల బిజినెస్ జరగగా సినిమా 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది, ఇక చిన్న సినిమానే అయినా జాతిరత్నాలు సాలిడ్ బిజినెస్ తో దుమ్ము లేపుతూ…
ఏకంగా 11 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని ఇప్పుడు 11.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది, ఇక కన్నడ డబ్ మూవీ రాబర్ట్ తెలుగు లో 1.5 కోట్ల బిజినెస్ ను సాధించగా సినిమా 1.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది, అన్ని సినిమాలలోకి ప్రజెంట్ హాట్ ఫేవరేట్ మాత్రం జాతిరత్నాలు అనే చెప్పాలి.
అల్టిమేట్ క్రేజ్ ఉన్న ఈ సినిమా మిగిలిన సినిమాలు సూపర్ డామినేట్ చేయడం ఖాయం, ఇక శ్రీకారం అండ్ గాలి సంపత్ మౌత్ టాక్ సూపర్ సాలిడ్ గా ఉంటేనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడం ఈజీ అవుతుంది, ఇక రాబర్ట్ టాక్ ని బట్టి మాస్ ఎలివేషన్స్ ని బట్టి మాస్ సెంటర్స్ లో జోరు చూపే అవకాశం ఉంది, మొత్తం మీద హాట్ ఫేవరేట్ మాత్రం జాతిరత్నాలు అనే చెప్పాలి..