Home న్యూస్ కాజల్ సత్యభామ మూవీ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

కాజల్ సత్యభామ మూవీ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దగ్గర కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ సత్యభామ(Satyabhama Review Rating)సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది, కాజల్ కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ చేసి పెట్టిందో తెలుసుకుందాం పదండీ…. ముందుగా సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే…

సిన్సియర్ పోలిస్ ఆఫీసర్ అయిన హీరోయిన్ తన భర్త నవీన్ చంద్రలో హ్యాప్పీగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉండగా ఒకరోజు తన భర్త నన్ను వేదిస్తున్నాడు అంటూ ఒక అమ్మాయి స్టేషన్ కి వచ్చి కేసు వేస్తుంది. హీరోయిన్ ఆ అమ్మాయి భర్తకి వార్నింగ్ ఇచ్చినా కూడా భర్త తన భార్యని చంపేస్తాడు…ఆ కేసుని డీల్ చేసిన హీరోయిన్ కి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి….ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా మిగిలిన కథ…

ఓవరాల్ గా కథ పాయింట్ బాగున్నా, కొన్ని చోట్ల మంచి సీన్స్ ఆకట్టుకున్నా కూడా ఓవరాల్ గా మూవీ మాత్రం పడుతూ లేస్తూ సాగుతూ యావరేజ్ రేంజ్ లో అనిపిస్తుంది…కాజల్ పెర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించగా కొన్ని చోట్ల ఎలివేషన్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి… ఫస్టాఫ్ కథ పర్వాలేదు అనిపించేలా ఉంటూ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకుని…

సెకెండ్ ఆఫ్ పై ఆసక్తి పెరగగా సెకెండ్ ఆఫ్ కథ మాత్రం డ్రాగ్ అయినట్లు అనిపించగా అక్కడక్కడా కొన్ని చోట్ల సీన్స్ బాగానే ఎలివేట్ చేసినా చెప్పిన విధానం మాత్రం చాలా స్లోగా అనిపించడంతో చూస్తున్న ఆడియన్స్ కొంచం బోర్ ఫీల్ అవుతారు… కానీ సినిమాలో చెప్పిన మెసేజ్ చాలా వరకు పర్వాలేదు అనిపించేలా ఉండటం, సినిమా కూడా మంచి క్వాలిటీతోనే రావడంతో…

అక్కడక్కడా స్లో అనిపించినా కూడా కాజల్ పెర్ఫార్మెన్స్ అండ్ సినిమాలో చెప్పిన మెసేజ్ కోసం కొంచం ఓపికతో చూస్తె సినిమా ఎండ్ అయ్యే టైంకి పర్వాలేదు అనిపించేలా సినిమా అనిపిస్తుంది. కాజల్ ఫ్యాన్స్ కి పర్వాలేదు అనిపించే సినిమా మిగిలిన ఆడియన్స్ కి మాత్రం యావరేజ్ రేంజ్ లెవల్ లో అనిపించవచ్చు. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here