Home న్యూస్ కల్కి రాయలసీమ బిజినెస్…సైన్స్ ఫిక్షన్ మూవీతో రికార్డ్ బిజినెస్!

కల్కి రాయలసీమ బిజినెస్…సైన్స్ ఫిక్షన్ మూవీతో రికార్డ్ బిజినెస్!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లాస్ట్ మూవీ సలార్(Salaar Movie) ఊరమాస్ కంటెంట్ తో వచ్చి సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా రాంగ్ టైం రిలీజ్ వలన ఆశించిన మేర సక్సెస్ అవ్వలేదు, ఇక ఇప్పుడు కంప్లీట్ గా డిఫెరెంట్ సబ్జెక్ట్ అయిన కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా…

ఇండియన్2 హిందీ బిజినెస్…అంత పెద్ద హిట్ కి ఈ బిజినెస్ ఏంటి సామి!!
భారీ క్రేజ్ నడుమ రిలీజ్ కానున్న సినిమా అన్ని ఏరియాల్లో ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకోగా రిలీజ్ దగ్గర పడుతూ ఉండగా ఒక్కో ఏరియా బిజినెస్ లెక్కలు బయటికి వస్తూ ఉండగా లేటెస్ట్ గా రాయలసీమ ఏరియాలో సినిమా బిజినెస్ కంప్లీట్ అయ్యింది. ఇది వరకు లాగా నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద బిజినెస్ జరగలేదు కానీ…

ఓవరాల్ గా కల్కి సినిమా కి అడ్వాన్స్ బేస్ మీద ఏకంగా 27 కోట్ల రేంజ్ లో మమ్మోత్ రేటుని చెల్లించినట్లు తెలుస్తుంది…టాలీవుడ్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రేటు అనే చెప్పాలి ఇప్పుడు…కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉండగా సినిమా టోటల్ రన్ లో ఈ మార్క్ ని దాటిన తర్వాతే లాభాలను మేకర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్లు పంచుకుంటారు….

ఒకవేళ సినిమా ఆ మార్క్ ని అందుకోక పొతే ఎంతవరకు లాస్ వస్తే అంత మొత్తం మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లకి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది…. ప్రభాస్ లాస్ట్ మూవీ సలార్ సీడెడ్ ఏరియాలో మొత్తం మీద 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో 22.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని లైట్ గా నష్టాలను సొంతం చేసుకుంది…

600 కోట్ల హీరో విజయ్….గోట్ తెలుగు బిజినెస్ ఆఫర్ ఎంత వచ్చిందో తెలుసా!
ఊరమాస్ మూవీ అయిన సలార్ తో పోల్చితే సైన్స్ ఫిక్షన్ డ్రామా అయిన కల్కి మూవీ కి సలార్ కి మించి రేటు సొంతం అయ్యింది కానీ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలి అంటే మాత్రం సినిమా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది, టికెట్ హైక్స్ అడ్వాంటేజ్ లభించబోతుంది అలాగే స్పెషల్ షోలు కూడా పడే అవకాశం ఉండటంతో కల్కి టార్గెట్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here