Home న్యూస్ ఇదే ఫైనల్….కల్కి2898AD ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్….కల్కి2898AD ఫైనల్ టాక్ ఇదే!!

1

ఆల్ మోస్ట్ మూడు నెలల బ్యాడ్ అన్ సీజన్ తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకుంది. పెద్ద స్టార్స్ నటించే సినిమాలు వస్తే జనాలు భారీగా థియేటర్స్ వస్తారు అని మరోసారి నిరూపిస్తూ ప్రభాస్(Prabhas) తన స్టార్ పవర్ ను చూపించగా తన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD మూవీ భారీ గా రిలీజ్ అయ్యి ప్రీమియర్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తర్వాత రెగ్యులర్ షోలకు కూడా…

ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది….కానీ సినిమా కొంచం లెంత్ ఎక్కువ అయ్యిందని, కథ చాలా వరకు ఫ్లాట్ గా ఉంటుంది అన్న కామెంట్స్ వినిపించగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఫ్యామిలీ, మాస్ అండ్ కామన్ ఆడియన్స్ నుండి సినిమాకి మొత్తం మీద ఎలాంటి టాక్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తి గా మారగా…

ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే కథ కొంచం స్లోగా స్టార్ట్ అయినా కూడా దీపికా పదుకునే సీన్స్ కొన్ని ఆకట్టుకోగా ప్రభాస్ మరియు అమితాబ్ ల సీన్స్ మెప్పించాయని, ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగా రాగా సెకెండ్ ఆఫ్ లో ప్రీ క్లైమాక్స్ నుండి కూడా సినిమా ఎక్స్ లెంట్ గా అనిపించింది అంటూ ఓవరాల్ గా సూపర్ హిట్ రేంజ్ లో మెప్పించింది అంటున్నారు…

మాస్ ఆడియన్స్ విషయానికి వస్తే కథ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టిందని, ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లు మాత్రం చాలా బాగా మెప్పించాయని కానీ మిగిలిన సినిమా కొంచం లెంత్ ఎక్కువగా అనిపించింది అంటున్న క్లైమాక్స్ ఎపిసోడ్ టికెట్ డబ్బులకు వర్త్ అని చెబుతూ సినిమా ఈజీగా హిట్ రేంజ్ లో ఉందని అంటున్నారు…

ఇక కామన్ ఆడియన్స్ ఇంటర్వెల్, ప్రభాస్-అమితాబ్ ల ఫైట్ సీన్స్ అలాగే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లు కుమ్మేసినా కూడా మిగిలిన కథ చాలా ఫ్లాట్ గా సాగిందని, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ కి చాలా టైం తీసుకున్నారని అంటున్నారు, లెంత్ తగ్గించి ఫస్టాఫ్ టేక్ ఆఫ్ కి టైం అంతగా తీసుకోకుండా ఉంటే బాగుండేది అని చెబుతూ ఓవరాల్ గా సినిమా ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో అనిపించింది అంటున్నారు…

ఓవరాల్ గా ప్రీమియర్స్ నుండి డే 1 ఎండ్ ఎయ్యే టైంకి కల్కి మూవీ కి మిక్సుడ్ టాక్ అనేది లేకుండా హిట్ టు సూపర్ హిట్ మధ్యలో టాక్ అయితే సెటిల్ అయ్యింది అని చెప్పాలి. ఈ టాక్ అడ్వాంటేజ్ తో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా లాంగ్ వీకెండ్ లో కలెక్షన్స్ జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

1 COMMENT

  1. హిట్ రేంజ్ దేనికి బ్రో ప్రభాస్ అసలు ఎక్కువ ఉంటాడా మూవీ లో, తప్పనోపి ఫ్యామిలీ వాళ్లకి అసలు తలనొప్పి అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here