Home న్యూస్ ఒక్క రోజులో ఇన్ని టికెట్స్ తెగాయా….ఇండియాలో ఇది రికార్డ్ సామి ఇప్పుడు!!

ఒక్క రోజులో ఇన్ని టికెట్స్ తెగాయా….ఇండియాలో ఇది రికార్డ్ సామి ఇప్పుడు!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అయిన కల్కి2898AD(Kalki2898AD Movie) వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమా కి ఆడియన్స్ నుండి సూపర్బ్ పాజిటివ్ రెస్పాన్స్ కూడా తోడు అవ్వగా కలెక్షన్స్ జాతరని మొదటి షో నుండే మొదలు పెట్టిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రాంపెజ్ ను చూపించడానికి సిద్ధం అవుతూ ఉండగా మొదటి రోజు సినిమాకి సంచలన టికెట్ సేల్స్ జరిగాయి ఆన్ లైన్ లో….

బుక్ మై షో లో రీసెంట్ టైంలో గంటలో, రోజులో ఎన్ని టికెట్స్ తెగాయి అన్నది అప్ డేట్ చేస్తూ ఉండగా వాళ్ళు ఇది మొదలు పెట్టిన తర్వాత ఇండియన్ మూవీస్ లో ఒక్క రోజులో ఆల్ టైం హైయెస్ట్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా కల్కి మూవీ ఇప్పుడు సంచలన రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అని చెప్పాలి….

రిలీజ్ కి 4 రోజుల ముందు నుండే బుక్ మై షోలో సినిమా బుకింగ్స్ ను ఓపెన్ చేయగా 4 రోజుల్లో ఏకంగా 1.7 మిలియన్ టికెట్ సేల్స్ జరిగాయి….కానీ రిలీజ్ రోజు ఒక్క రోజునే సినిమా టికెట్ సేల్స్ ఊహకందని రేంజ్ లో జోరు చూపించి ఏకంగా 1.12 మిలియన్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది కల్కి మూవీ ఇప్పుడు…

   

రీసెంట్ టైంలో బుక్ మై షోలో ఒక్క రోజులో ఇలా ఆల్ టైం రికార్డ్ లెవల్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా కల్కినే అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ రాంపెజ్ ఏ రేంజ్ లో ఉంది అన్నదానికి ఇది నిదర్శనం అని చెప్పాలి. సినిమా కి వచ్చిన పాజిటివ్ టాక్ ఇంపాక్ట్ కూడా కలిసి వచ్చింది. కానీ నైట్ షోలకు వర్షాలు అలాగే సెమీ ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ కొంచం ఇబ్బంది పెట్టాయి…

అవి లేకుండా ఉండి ఉంటే మొదటి రోజు టికెట్ సేల్స్ ఇంకా ఎక్కువే ఉండేది. బుక్ మై షోతో పాటు పేటిఏం లో కూడా భారీ గా టికెట్ సేల్స్ జరిగాయి. ఓవరాల్ గా మొదటి రోజు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసిన కల్కి మూవీ ఇక లాంగ్ వీకెండ్ లో ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here