Home న్యూస్ కల్కి హిందీ బుకింగ్స్….ఇది ఎవ్వరూ ఊహించలేదు…డే 1 మాస్ రచ్చ ఖాయం!

కల్కి హిందీ బుకింగ్స్….ఇది ఎవ్వరూ ఊహించలేదు…డే 1 మాస్ రచ్చ ఖాయం!

1

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) మూవీ అత్యంత భారీ అంచనాల నడుమ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమాకి మేకర్స్ అనుకున్న రేంజ్ లో ప్రమోషన్స్ అయితే చేయలేదు….తెలుగు వరకు ప్రమోషన్స్ అవసరం లేదు కానీ…

హిందీలో ప్రమోషన్స్ చాలా అవసరం అవ్వడం, మేకర్స్ జస్ట్ బుజ్జి ప్రమోషన్స్ తోనే సరిపెట్టగా హిందీలో సినిమా ఓపెనింగ్స్ పై ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనుకోగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాకి భారీ ఓపెనింగ్స్ హిందీలో వస్తాయో లేదో అన్న డౌట్స్ నడుమ కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి…

ఆస్తులు అమ్ముకునేలా చేసిన 2 సినిమాలు…లాస్ ఎన్ని కోట్లో తెలుసా!
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో కుమ్మేసిన కల్కి మూవీ హిందీ బెల్ట్ లో కూడా ప్రభాస్ స్టార్ డం పవర్ ను చూపెడుతూ ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దూసుకు పోతుంది…. దాంతో ఇప్పుడు హిందీలో సినిమా వీక్ ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు అనుకున్న టాక్ నుండి ఇప్పుడు సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా…

సినిమా మొదటి రోజు రచ్చ చేయబోతుంది…అద్బుతమైన టికెట్ సేల్స్ తో జోరు చూపిస్తున్న కల్కి మూవీ హిందీలో ఇప్పుడు ఉన్న ఊపు దృశ్యా ట్రేడ్ వర్గాలు మొదటి రోజు హిందీలో 15-18 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు…

సలార్ 60…..కల్కి 70….నైజాంలో రెబల్ స్టార్ రికార్డుల రాంపెజ్!
టాక్ బాగుంటే కనుక ఇక షో షో కి కలెక్షన్స్ పరంగా మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీక్ ఓపెనింగ్స్ అనుకున్న చోట ఇప్పుడు ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది…

అది కూడా గురువారం లాంటి నార్మల్ వర్కింగ్ డే లో పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రభాస్ పేరు మీద ఇప్పుడు కల్కి మాస్ రచ్చ చేయబోతూ ఉండగా తొలిరోజు ఇండియాలో వరల్డ్ వైడ్ గా కూడా సినిమా మాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
భారతీయుడు2 ట్రైలర్ రివ్యూ….ఇది అసలు శంకర్ సినిమానేనా!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here