రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) రిలీజ్ కి ముందు బజ్ బాగానే ఉన్నా కూడా ప్రమోషన్స్ పెద్దగా చేయక పోవడం, బయర్స్ మునుపటిలా భారీ రేట్లు పెట్టి నాన్ రిఫండబుల్ అమౌంట్ పెట్టి సినిమాను కొనకపోవడంతో అడ్వాన్స్ బేస్ మీదే రిలీజ్ అయిన ఈ సినిమా….మేకర్స్ బయర్స్ నుండి అడ్వాన్స్ బేస్ మీద…
డబ్బులు తీసుకుని తమ కష్టాన్నే నమ్ముకుని రిలీజ్ చేశారు…కానీ అడ్వాన్స్ లు ఓవరాల్ గా 168 కోట్ల దాకా ఉండటంతో తెలుగు రాష్ట్రాల నుండి ఈ మొత్తం రికవరీ అవుతుందా అన్న అనుమానాలు రేకెత్తాయి… అడ్వాన్స్ బేస్ మీదే అవ్వడంతో టార్గెట్ ను అందుకోక పొతే బయర్స్ కి కూడా డబ్బులు రిటర్న్ వస్తాయి అని తెలిసినా…
ట్రేడ్ లెక్కల్లో 168 కోట్ల వాల్యూ బిజినెస్ సైన్స్ ఫిక్షన్ కథతో అందుకోవడం అంటే చాలా కష్టమే…కానీ అక్కడ ఉన్నది రెబల్ స్టార్ అవ్వడం, సైన్స్ ఫిక్షన్ కి మైతలాజిక్ టచ్ కూడా కలిసి రావడంతో ఆడియన్స్ సినిమాను చూడటానికి ఎగబడి థియేటర్స్ కి వెళ్ళడంతో…
అనుకున్న అంచనాలను సినిమా అందుకుని ఆల్ మోస్ట్ 15 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 168 కోట్ల లోపు షేర్ ని అందుకోగా మూడో వీకెండ్ లో సాధించబోయే కలెక్షన్స్ తో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా లాభాలను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది…
కానీ అదే టైంలో ఆంధ్ర అండ్ సీడెడ్ లో సినిమాకి కొన్ని ఏరియాల్లో వాల్యూ అడ్వాన్స్ బిజినెస్ ను అందుకునే అవకాశం లేక పోవడంతో మేకర్స్ ఆ డబ్బులను బయర్స్ కి వెనక్కి ఇచ్చేస్తారు… అయినా కూడా ఓవరాల్ గా బిజినెస్ మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ లాభాలు ఇప్పుడు సొంతం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది…