Home న్యూస్ 1st డే కల్కి హిందీ కలెక్షన్స్…అంచనాలను మించిపోయిన భీభత్సం ఇది!!

1st డే కల్కి హిందీ కలెక్షన్స్…అంచనాలను మించిపోయిన భీభత్సం ఇది!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki2898AD Movie) రీసెంట్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా మీద తెలుగు రాష్ట్రాల్లో ఎలాగూ భారీ అంచనాలు ఉండగా నార్త్ లో కూడా అంచనాలు అలానే ఉన్నప్పటికీ ప్రమోషన్స్ అనుకున్న రేంజ్ లో చేయక పోవడంతో ఓపెనింగ్స్ ను ఎలా సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తి గా మారగా…

హిందీ లో ప్రమోషన్స్ చాలా కీలకం అవ్వడం, నార్మల్ వర్కింగ్ డే లో సినిమా రిలీజ్ అవుతూ ఉండటంతో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అని అందరూ అనుకున్నారు…. సినిమా భారీ బడ్జెట్ తో తెరకేక్కడం, ప్రభాస్ కి అక్కడ మార్కెట్ ఉండటంతో 10-12 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ డీసెంట్ ఓపెనింగ్స్ అనుకోగా రిలీజ్ రోజుకి వచ్చే సరికి బుకింగ్స్ సూపర్ సాలిడ్ గా కొనసాగగా 15 కోట్ల రేంజ్ లో వెళ్ళే అవకాశం ఖాయం అనిపించింది…

ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాకి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వడంతో షో షోకి కలెక్షన్స్ పరంగా సాలిడ్ గా జోరుని చూపించిన సినిమా ఓవరాల్ గా మొదటి రోజు ఇప్పుడు కలెక్షన్స్ పరంగా అంచనాలను అన్నీ కూడా మించిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు…

తొలిరోజు ఏకంగా 22.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని హిందీలో సొంతం చేసుకున్న సినిమా ఊరమాస్ జోరుని చూపించింది. హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా గ్రాస్ 30 కోట్లకు పైగా ఉండటం కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో ఏ రేంజ్ లో రచ్చ చేసింది అన్నదానికి నిదర్శనం అని చెప్పాలి ఇప్పుడు..ఓవరాల్ గా హిందీ లో ప్రభాస్ కి…

ఇది 4 సారి 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా అవ్వడం విశేషం అని చెప్పాలి. సినిమా కి హిందీలో వస్తున్న రెస్పాన్స్ ఇప్పుడు చూస్తూ ఉంటే వీకెండ్ లో అవలీలగా 85-90 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంతకుమించి వస్తే ఇక లాంగ్ రన్ లో సినిమా హిందీలో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here