Home న్యూస్ రికార్డ్ ఖాయం అనుకుంటే…కల్కి నైజాం 1st డే కలెక్షన్స్ భారీ షాకిచ్చాయిగా!

రికార్డ్ ఖాయం అనుకుంటే…కల్కి నైజాం 1st డే కలెక్షన్స్ భారీ షాకిచ్చాయిగా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సంచలన అడ్వాన్స్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ అయిన కల్కి2898AD(Kalki 2898 AD Movie) ఓవర్సీస్ లో రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో అక్కడ రికార్డులను నమోదు చేసింది. అదే టైంలో సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో సైతం…

ఎక్స్ లెంట్ బుకింగ్స్ సొంతం అవ్వగా రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అనిపించింది..కానీ ఇప్పుడు ఒక్కో ఏరియాలో మొదటి రోజు షేర్స్ లెక్కలు కొంచం రేసులో వెనకబడ్డాయి. కానీ నైజాం లాంటి ఏరియాలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసి ఆర్ ఆర్ ఆర్ మరియు సలార్ బుకింగ్స్ ను సైతం క్రాస్ చేసి సంచలనం సృష్టించింది….

దాంతో తొలిరోజు ఇక్కడ కొత్త డే 1 రికార్డ్ నమోదు అవుతుంది అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు…కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇప్పుడు నైజాం ఏరియాలో టాప్ 3 ప్లేస్ తో సరిపెట్టుకున్నాయి.  నైట్ షోలకు వర్షాలు, అలాగే సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంపాక్ట్ చూపగా, అర్బన్ ఏరియాస్, క్లాస్ సెంటర్స్ లో సెన్సేషనల్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్నా కూడా…

   

రూరల్ ఏరియాల్లో మాత్రం బుకింగ్స్ అనుకున్న రేంజ్ లో జరగలేదు, దానికి తోడూ భారీ టికెట్ హైక్స్ కూడా కొద్దిగా ఇంపాక్ట్ చూపినట్లు ఉండగా ఓవరాల్ గా సలార్ కి ఆర్ ఆర్ ఆర్ కి మధ్యలో ఓపెన్ అవుతుంది అనుకున్న సినిమా ఇప్పుడు ఫస్ట్ డే 19.60 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు….అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ మోస్ట్ 20 కోట్ల దాకా తొలిరోజు నైజాంలో సొంతం అవ్వగా…

ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా కొంచం జోరు తగ్గింది. అయినా సినిమా జానర్ దృశ్యా మాత్రం ఇవి సెన్సేషనల్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో నైజాంలో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం అయితే ఎంతైనా ఉంది. అది ఏ రేంజ్ దాకా వెళుతుందో వీకెండ్ తర్వాత క్లారిటీ వస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here