ఏడాది గ్యాప్ లో మిగిలిన స్టార్ హీరోలు ఒక సినిమా చేయడానికే కష్టపడుతూ ఉంటే పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) మాత్రం….ఆదిపురుష్, సలార్ లాంటి బిగ్ పాన్ ఇండియా మూవీస్ తర్వాత ఇప్పుడు కొత్తగా కల్కి 2898AD(Kalki2898AD Movie) లాంటి భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు….
ట్రైలర్ ల రిలీజ్ తర్వాత సినిమా మీద మంచి హైప్ నెలకొనగా భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, కాగా ఇది వరకటిలా నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద బిజినెస్ చేయకుండా అడ్వాన్స్ బేస్ మీద భారీ బిజినెస్ ను చేశారు ఇప్పుడు…
అంటే సినిమా ఒకవేళ ఈ మమ్మోత్ బిజినెస్ ను రికవరీ చేయకపొతే అడ్వాన్స్ లు పే చేసిన వాళ్ళకి వచ్చిన నష్టాలు మేకర్స్ రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అగ్రిమెంట్ కింద సినిమాకి భారీ లెవల్ లో అడ్వాన్స్ లు దక్కాయి. ఒకసారి సినిమా వాల్యూ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే….
#Kalki2898AD WW Pre Release Business Details(Valued)
👉Nizam: 65Cr
👉Ceeded: 27Cr
👉UA: 21Cr
👉East: 14Cr
👉West: 10Cr
👉Guntur: 12Cr
👉Krishna: 12Cr
👉Nellore: 7Cr
AP-TG Total:- 168CR
👉KA: 25Cr(Valued)
👉Tamilnadu: 16Cr(Valued)
👉Kerala: 6Cr(Valued)
👉Hindi+ROI: 85Cr(Valued)
👉OS – 70Cr
Total WW: 370CR(Break Even- 372CR+)
మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా 370 కోట్ల భారీ బిజినెస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 372 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అడ్వాన్స్ బేస్ బిజినెస్ తో అందరూ సేఫ్ గానే ఉన్నప్పటికీ సినిమా కి కనుక టాక్ బాగా వస్తే…
సోలో రిలీజ్, భారీ టికెట్ హైక్స్, స్పెషల్ షోలు, కొంత గ్యాప్ తర్వాత ఇండియా లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా రిలీజ్ ఇలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ లు ఉన్న కల్కి మూవీ ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.