Home న్యూస్ ఊరమాస్ సలార్ ని వారంలో లేపిన కల్కి2898 AD!

ఊరమాస్ సలార్ ని వారంలో లేపిన కల్కి2898 AD!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) రీసెంట్ టైంలో నటించిన ఊరమాస్ మూవీ సలార్(Salaar part 1)….కంప్లీట్ మాస్ మూవీగా వచ్చిన ఈ సినిమా అనుకున్న టైం సెప్టెంబర్ ఎండ్ కే రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా రికార్డులు సృష్టించి ఉండేది కానీ పోస్ట్ పోన్ అయ్యి క్లాష్ లో రిలీజ్ అవ్వడం వలన లాంగ్ రన్ పై…

ఆ ఇంపాక్ట్ పడినా కూడా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. ఈ సినిమా తో పోల్చితే సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వచ్చిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో….

దుమ్ము లేపుతూ ఇప్పుడు మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తో ప్రభాస్ కెరీర్ లో బాహుబలి2 తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సలార్ మూవీ లైఫ్ టైం టోటల్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది… అది కూడా జస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలోనే సాధించిన కలెక్షన్స్ తో…

క్రాస్ చేయడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద టోటల్ రన్ లో సలార్ మూవీ 630 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా జస్ట్ వారం రోజుల్లో ఇప్పుడు కల్కి మూవీ ఈ మార్క్ ని దాటేసి ప్రభాస్ కెరీర్ లో ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించింది…

సూపర్ పాజిటివ్ టాక్ ఉన్న కల్కి మూవీ ఇప్పుడు లాంగ్ రన్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా టోటల్ రన్ లో సినిమా మరింత జోరు పెంచి భారీ మార్జిన్ తో సలార్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ తో రచ్చ చేయబోతుంది. ఆ మార్జిన్ ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది సెకెండ్ వీక్ లో సినిమా హోల్డ్ చేసే తీరుని బట్టి చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here