Home న్యూస్ ఒక్క రోజులో లెక్కలు మారాయి….ఇక విద్వంసం ఖాయం!!

ఒక్క రోజులో లెక్కలు మారాయి….ఇక విద్వంసం ఖాయం!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి2898AD( Kalki2898AD Glimpse) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు విపరీతమైన ట్రోల్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే…

ఆ ట్రోల్స్ ని తట్టుకోలేక మేకర్స్ కూడా ట్విట్టర్ లో అఫీషియల్ హ్యాండిల్ లో వేసిన ప్రభాస్ ఫస్ట్ లుల్ పోస్టర్ ను సైతం డిలేట్ చేసి మళ్ళీ కొత్త లుక్ ని రిలీజ్ చేశారు. ఆ టైంలో అప్పటి వరకు సినిమా మీద అంచనాల దృశ్యా పోస్టర్ అంచనాలను అందుకొకపోవడంతో…

ఒక్క రోజులో భారీగా ట్రోల్స్ ని ఫేస్ చేసింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సైతం తమ అంచనాలకు తగ్గట్లు ఈ పోస్టర్ లేదని కామెంట్స్ చేశారు… కానీ ఒక్క రోజులో లెక్కలన్నీ మారిపోయి సినిమా అఫీషియల్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత…

ట్రోల్స్ ని మారిపోయి ఫ్యాన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ నుండి కూడా ఫుల్ పాజిటివ్ నెస్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం. టోటల్ గా లెక్కలన్నీ మారిపోగా ఇక ఇప్పుడు సినిమా మీద…

పోస్టర్ రిలీజ్ కి ముందు ఉన్న అంచనాలతో పోల్చితే ఇప్పుడు స్కై హై లెవల్ లో అంచనాలు పెరిగి పోయాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా అంచనాలను అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోయడం ఖాయమని చెప్పొచ్చు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here