నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మేహ్రీన్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “ఎంత మంచి వాడవురా”… బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆటకే ఫ్లాఫ్ టాక్ ని సొంతం చేసుకోగా ఎ దశలో కూడా టార్గెట్ ని అందుకోలేదు.
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా పరుగును ముగించిన ఈ సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. స్టార్ మా ఛానెల్ ఈ సినిమా ను సుమారు 3.6 కోట్ల రేటు చెల్లించి హక్కులను తీసుకున్నట్లు వార్తలు ఉన్నాయి. ఇక సినిమా రీసెంట్ గా టెలికాస్ట్ కాగా…
సినిమా కి పర్వాలేదు అనిపించేలా 7.28 TRP రేటింగ్ దక్కింది. ఇది ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే TRP రేటింగ్ గా చెప్పుకోవచ్చు. తర్వాత టెలికాస్ట్ 2 మూడు సార్లు అయితే ఛానెల్ కి సినిమా మంచి లాభాలనే దక్కించే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక కళ్యాణ్ రామ్ గత ఏడాది 118 మూవీ తో మంచి కంబ్యాక్ ఇచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం నిరాశని మిగిలించింది అని చెప్పొచ్చు. దాంతో తన అప్ కమింగ్ మూవీ తో మంచి కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్.