Home గాసిప్స్ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్!!

వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్!!

0

    టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉన్నా వెండి తెరపై “వకీల్ సాబ్” సినిమా తో కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే, కాగా ఈ సినిమా షూటింగ్ చాలా వరకు జరగగా ప్రస్తుతం జరిగిన పరిస్థితుల నేపధ్యంలో షూటింగ్ ఆగిపోయింది.

ఇక ప్రస్తుత పరిస్థితుల విషయాలపై సోషల మీడియా లో పవర్ స్టార్ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుండగా మరో పక్క వర్క్ ఫ్రం హోమ్ కూడా చేస్తున్నాడట పవర్ స్టార్. వకీల్ సాబ్ సినిమా కి గాను తన డబ్బింగ్ పనులను ఇంట్లో నుండే చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.

తన పాత్ర తాలుకూ టోటల్ డైలాగ్స్ ని తెప్పించుకున్న పవర్ స్టార్ వీలు కుదిరినప్పుడల్లా తన డబ్బింగ్ ని పూర్తీ చేస్తున్నాడట. దాంతో షూటింగ్ మొదలు అయితే రిలీజ్ కొద్దిగా లేట్ అయినా అప్పటి సమయానికి అందుకునే అవకాశం ఉంటుందని సమాచారం.

ఇక వకీల్ సాబ్ తర్వాత అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా శ్రీరామనవమి రోజున సినిమా కొత్త అప్ డేట్స్ వచ్చే అవకాశం కొద్ది వరకు ఉందని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. మరి అది కొత్త పోస్టరా లేక కొత్త పాట అప్ డేటా అన్నది తెలియాల్సి ఉంది. టీసర్ కి మరింత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here