లోక నాయకుడు కమల్ హాసన్ ఒక పక్క సినిమాలతో మరో పక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే మధ్యలో బిగ్ బాస్ తమిళ్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా దూసుకుపోతున్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో సరైన హిట్ లేక పోవడం తో పెర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తుండగా తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన భారతీయుడు సినిమా కి సీక్వెల్ గా శంకర్ డైరెక్షన్ లోనే…
ఇండియన్ 2 సినిమా ను అత్యంత భారీ ఎత్తున 200 కోట్లతో మొదలు పెట్టినప్పటికీ మొదటి నుండి ఎదో ఒక అవరోధం వస్తూనే ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతి అనుకున్న ఈ సినిమా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కూడా కలిసి ఏకంగా 2022 సంక్రాంతి కి పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం.
ఈ గ్యాప్ లో కమల్ హాసన్ ఏం చేస్తారు అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న టైం లో రీసెంట్ టైం లో రెండు సినిమాలతోనే తమిళ్ లో సాలిడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తన అప్ కమింగ్ మూవీ ని రీసెంట్ గా అనౌన్స్ చేశారు కమల్ హాసన్.
ఖైదీ బ్లాక్ బస్టర్ తర్వాత కోలివుడ్ టాప్ హీరో విజయ్ తో మాస్టర్ చేసిన లోకేష్ ఇప్పుడు కొత్త సినిమాను కమల్ తో అనౌన్స్ చేయగా ఈ సినిమా ను 70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో షూటింగ్ జరిపి సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు.
అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కి వన్స్ అపోన్ అ టైం దేర్ లివుడ్ ఏ ఘోస్ట్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ మూవీ అని తెలుస్తుంది, 200 కోట్లతో చేస్తున్న ఇండియన్ 2 డిలే గ్యాప్ లో ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు కమల్ హాసన్…