Home న్యూస్ కుమ్మేసిన కంగువ ఫైర్ సాంగ్….సూర్యకి బ్లాక్ బస్టర్ ఖాయం!

కుమ్మేసిన కంగువ ఫైర్ సాంగ్….సూర్యకి బ్లాక్ బస్టర్ ఖాయం!

0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ను ఎప్పుడో సొంతం చేసుకున్న సూర్య(Suriya) కెరీర్ పీక్ టైం లో అనుకున్న రేంజ్ లో మూవీస్ ని ఎంచుకునే విషయంలో వెనుకంజ వేయడంతో వరుస ఫ్లాఫ్స్ వలన తన మార్కెట్ మీద భారీ ఇంపాక్ట్పడింది. చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకుంటూ ఉండగా…

ఆల్ మోస్ట్ రెండేళ్ళకి పైగా టైం తీసుకుని ఇప్పుడు శివ డైరెక్షన్ లో కంగువ(Kanguva Movie) చేస్తున్న సూర్య అక్టోబర్ 10న సినిమాను రిలీజ్ చేయబోతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ అంచనాలు సాలిడ్ గా ఉండగా సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా…

ఏమాత్రం అంచనాలను అందుకున్నా కోలివుడ్ తరుపున ఈ ఇయర్ లోనే కాదు హిస్టరీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా రీసెంట్ గా సూర్య పుట్టిన రోజున సినిమా నుండి ఫైర్ సాంగ్ ను రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్…

మ్యూజిక్ పరంగా ఎంత బాగుందో విజువల్స్ పరంగా కూడా అంతే బాగుండటంతో అంచనాలను మించిపోయింది అని చెప్పాలి. విజువల్స్, గ్రాండియర్ ఎక్స్ లెంట్ గా ఉండగా సూర్య విలనీష్ లుక్ మెస్మరైజ్ చేయడం ఖాయమని చెప్పొచ్చు..

సాంగ్ విజువల్ పరంగా చాలా రిచ్ గా ఉండటం దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగా మెప్పించడంతో ఓవరాల్ గా సాంగ్ సినిమా మీద అంచనాలను సాలిడ్ గా పెంచేసింది అని చెప్పాలి. సినిమా ఔట్ పుట్ కూడా చాలా బాగా వచ్చింది అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతూ ఉండటంతో కంగువతో సూర్య సాలిడ్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here