Home న్యూస్ దేవ్ షార్ట్ రివ్యూ….పారిపొండిరోయ్!

దేవ్ షార్ట్ రివ్యూ….పారిపొండిరోయ్!

0

     తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో కార్తి. రీసెంట్ టైం లో ఖాకీ మరియు చినబాబు సినిమాలతో ఇక్కడ కూడా మంచి సక్సెస్ లను తన సొంతం చేసుకున్న కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ దేవ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా సినిమా ఓవర్సీస్ లో జస్ట్ ఒకే అనిపించే టాక్ ని సొంతం చేసుకోగా రెగ్యులర్ షోల అసలు సిసలు టాక్ ఏంటో ఇప్పుడు వచ్చేసింది.

స్టొరీ లైన్: అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే హీరో, లైఫ్ లో అస్సలు ఖాళీ లేకుండా బిజీ గా ఉండే హీరోయిన్ ఇద్దరు కలిసిన తర్వాత వారి మధ్య ప్రేమ ఎలా మొదలు అయింది, కొన్ని కారణాల వల్ల వచ్చిన పరిస్థితులు ఏంటి… తిరిగి ఎలా ఏకం అయ్యారు అన్నది ఓవరాల్ గా సినిమా..

హైలెట్స్:
* కార్తీ లుక్ అండ్ డైలాగ్స్, రిచ్ లోకేషన్స్
* హారీష్ జయరాజ్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్,
* అక్కడక్కడా అలా అలా నచ్చించే ఒకటి రెండు సీన్స్
ఇంతే ఓవరాల్ గా సినిమాలో హైలెట్స్ అండ్ ప్లస్ పాయింట్స్ మొత్తం ఇవే అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…

మైనస్ పాయింట్స్:
* ఏ సీన్ ని కూడా కనెక్ట్ కాలేక పోవడం,
*డైరెక్షన్ ఎంత వీక్ అంటే మాటల్లో చెప్పలేం,
* రమ్యకృష్ణ- ప్రకాష్ రాజ్ లు ఉన్నా స్క్రీన్ స్కోప్ చాలా తక్కువ ఉండటం, అస్సలు ఇంపాక్ట్ చూపకపోవడం,
* ఫస్టాఫ్ అండ్ సెకెండ్ ఆఫ్ చాలా సీన్స్ బోర్ కొట్టించడం, సాగదీయడం.. ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి.

ఓవరాల్ గా దేవ్ తో హాట్రిక్ కొట్టాలి అని భావించిన కథ లో దమ్ము లేకపోవడం తో తన పాత్ర వరకు కొంచం అలరించినా సినిమాని సేఫ్ చేయలేకపోయాడు. మీదగ్గర ఖాళీ సమయం చాలా ఉంటే… ఒకసారి సినిమా ని చూడొచ్చు. ఫైనల్ గా సినిమా రేటింగ్… 2 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here