కొన్ని సార్లు పర్వాలేదు బాగుంది అన్న టాక్ వచ్చిన సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ అవుతాయి, చాలా సార్లు మాత్రం అలా టాక్ తెచ్చు కున్నా కానీ కలెక్షన్స్ ని సాధించలేక ఫ్లాఫ్ గా మారు తాయి… లాస్ట్ ఇయర్ ఖైదీ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న కార్తి రెండు నెలల గ్యాప్ లో దొంగ అనే మరో సినిమా తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయిన ఈ సినిమా 3.5 కోట్ల బిజినెస్ కి కేవలం 1.86 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా….
తర్వాత ఈ సినిమాను జీ తెలుగు వాళ్ళు 1.6 కోట్ల రేంజ్ రేటు మాత్రమే చెల్లించి ఫ్యాన్సీ రేటు కి సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకోగా… సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడే డిసాస్టర్ అనిపించే విధంగా కేవలం 3.44 TRP రేటింగ్ ని సాధించి షాక్ ఇవ్వగా…
రీసెంట్ గా రెండో సారి కూడా టెలికాస్ట్ అయిన సినిమా మరో సారి నిరాశ పరిచే రేటింగ్ ని అందుకుంది. సినిమా కి సెకెండ్ టెలికాస్ట్ టైం లో కేవలం 2.14 TRP రేటింగ్ మాత్రమే దక్కడం తో ఛానెల్ కి మొత్తం మీద లో రేటింగ్స్ వలన పెట్టిన డబ్బు చాలా తక్కువే అయినా రికవరీ అవ్వలేదని సమాచారం.
దాంతో సినిమా టెలివిజన్ లో కూడా డిసాస్టర్ రన్ ని కొనసాగిస్తుండగా… ఛానెల్ ఇప్పుడు రికవరీ అవ్వాలి అంటే సినిమా మరో రెండు సార్లు మినిమమ్ టెలికాస్ట్ అయ్యి యాడ్స్ ని సాధిస్తేనే సాధ్యం అవుతుంది అంటున్నారు. కార్తి ఖైదీ కూడా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయినా టెలివిజన్ లో లోవెస్ట్ రేటింగ్ ని అందుకోగా ఇప్పుడు ఈ సినిమా ఇంకా షాక్ ఇచ్చింది..