Home TRP రేటింగ్ 5 ఏళ్ల క్రితం మూవీ: TRP లో టాలీవుడ్ లో కొత్త రికార్డ్ ఇది!!

5 ఏళ్ల క్రితం మూవీ: TRP లో టాలీవుడ్ లో కొత్త రికార్డ్ ఇది!!

0

నారా రోహిత్ కెరీర్ లో చేసిన మంచి సినిమా లలో అసుర అనే సినిమా కూడా ఒకటి, హానెస్ట్ పోలిస్ ఆఫీసర్ రోల్ లో నటించి మెప్పించాడు నారా రోహిత్.. సినిమా కూడా డీసెంట్ గానే ఉంటుంది కానీ అప్పట్లో వరుస ఫ్లాఫ్ మూవీస్ ఎఫెక్ట్ ఈ సినిమా పై కూడా పడటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నిరాశ పరిచి ఫ్లాఫ్ గా పరుగును ముగించాల్సి వచ్చింది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 5 ఏళ్లకి టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది, ఈ మధ్య వేసిన సినిమాలే వేస్తూ వస్తున్న స్టార్ మా ఆ రూట్ ని పక్కకు పెట్టి ఓల్డ్ మూవీస్ శాటిలైట్ రైట్స్ అమ్మకుండా ఉన్నవి వెతికి ఎంతో కొంత రేటు చెల్లించి….

ఇప్పుడు ఆ సినిమాలను టెలికాస్ట్ చేస్తూ మంచి రేటింగ్స్ ని సాధిస్తూ ఉండగా ఇప్పుడు అసుర సినిమా రిలీజ్ అయిన 5 ఏళ్ల తర్వాత స్టార్ మా ఛానెల్ తక్కువ రేటు కే కొనగా లాస్ట్ వీక్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా షాకింగ్ లో TRP రేటింగ్ ని సాధించింది.

సినిమా కి ఫస్ట్ టెలికాస్ట్ లో 2.29 TRP రేటింగ్ దక్కగా టాలీవుడ్ లో స్ట్రైట్ తెలుగు మూవీస్ పరంగా ఇది లోవేస్ట్ TRP రేటింగ్ లలో ఒకటి అని అంటున్నారు. 5 ఏళ్ల క్రితం మూవీ, పెద్దగా ప్రమోషన్ కూడా చేయలేదు లాంటి ఎఫెక్ట్ లు ఉన్నా కానీ ఓవరాల్ గా టాలీవుడ్ తరుపున లోవేస్ట్ TRP రేటింగ్ ని అందుకున్న సినిమాగా…

ఈ సినిమా నిలిచింది అని చెప్పాలి, ఇది వరకు లోవేస్ట్ TRP మూవీస్ లో డబ్బింగ్ మూవీస్ చెలియా 1.89 మరియు క్రైం 23 సినిమాలు 1.88 రేటింగ్స్ తో ఆల్ టైం లోవేస్ట్ లో ఉండగా స్ట్రైట్ తెలుగు సినిమాల పరంగా ఇప్పుడు అసుర సినిమా అతి తక్కువ రేటింగ్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here