Home న్యూస్ బ్లాక్ బస్టర్ తర్వాత డిసాస్టర్…ఇప్పుడు కార్తీ సుల్తాన్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

బ్లాక్ బస్టర్ తర్వాత డిసాస్టర్…ఇప్పుడు కార్తీ సుల్తాన్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

0

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా సూపర్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరోల్లో కార్తీ కూడా ఒకరు, అడపాదడపా ఫ్లాఫ్స్ పడ్డా కానీ ఎప్పటి కప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి మళ్ళీ జోరు అందుకునే కార్తీ రీసెంట్ టైం లో ఫ్లాఫ్స్ పడ్డా బాక్స్ ఆఫీస్ దగ్గర ఖైదీ సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు…

తెలుగు లో కూడా అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా. ఈ సినిమా విజయం తర్వాత కార్తీ నటించిన దొంగ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా, ఇప్పుడు ఆ డిసాస్టర్ తర్వాత కార్తీ రష్మిక తో కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ…

సుల్తాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి సిద్ధం అవ్వగా టీసర్ ట్రైలర్ లతో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో ఓవరాల్ గా బిజినెస్ పరంగా కూడా దుమ్ము లేపింది. సినిమా సాధించిన టోటల్ బిజినెస్ ను గమనిస్తే… నైజాం ఏరియాలో సినిమా కి…

2 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 1 కోటి బిజినెస్ ను సాధించింది, ఇక టోటల్ ఆంధ్రా లో 3 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే…

తెలుగు రాష్ట్రాల నుండి 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, ఈ వీకెండ్ రిలీజ్ అయ్యే మూవీస్ లో కొంచం మాస్ టచ్ బాగున్న మూవీ ఇదే కాబట్టి టాక్ బాగుంటే కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here