బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కాటమరాయుడు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా రంజాన్ పండగ అడ్వాంటేజ్ తో రిలీజ్ అయినా కూడా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ వీకెండ్ పర్వాలేదు అనిపించినా కానీ…
తర్వాత మాత్రం ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది ఈ సినిమా. ఇప్పుడు ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇండియా లో అతి కష్టం మీద 90 కోట్లతో మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది. రెండో వీక్ లో కొంచం కష్టపడితే…
100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదు కానీ సినిమా బడ్జెట్ ఆల్ మోస్ట్ 150 కోట్లు కాగా ఇప్పటి వరకు వచ్చిన వర్త్ షేర్ 45 కోట్ల లోపే ఉండటం తో సినిమా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టార్ పవర్ తో మిక్సుడ్ టాక్ తో కూడా 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అయితే సల్మాన్ సొంతం చేసుకుంటున్నాడు కానీ తన రేంజ్ మూవీ అయితే ఈ సినిమా కాదని అందరూ అంటున్నారు. ఇక త్వరలోనే టైగర్ జిందా హై సినిమాతో రాబోతున్న సల్మాన్ ఆ సినిమా తో మాత్రం సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.