పెళ్లి చూపులు(Pelli Choopulu) ఈ నగరానికి ఏమైంది(Ee Nagaraniki Emaindi) లాంటి సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కీడా కోలా(Keedaa Cola) సినిమా ఆడియన్స్ ముందుకు డీసెంట్ బజ్ నడుమ గ్రాండ్ గానే రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది ఈ శుక్రవారం…
సినిమా ఓవర్సీస్ లో 400 వరకు లోకేషన్స్ లో రిలీజ్ కానుండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా ట్రేడ్ పరంగా కూడా మంచి బిజినెస్ నే సొంతం చేసుకుంది. కొన్ని చోట్ల ఓన్ గా కొన్ని చోట్ల డీసెంట్ రేట్స్ కి అమ్మిన ఈ సినిమా…
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ 8.5 కోట్ల నుండి 9 కోట్ల దాకా ఉంటుందని అంచనా.. క్లియర్ లెక్కలు రాలేదు కానీ బిజినెస్ రేంజ్ ఈ లెక్కలో ఉండే అవకాశం ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఓవరాల్ గా…
9.5 కోట్లకు పైగా షేర్ ని సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాలి. ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది, తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్స్ కి డీసెంట్ రెస్పాన్స్ రావడంతో నార్మల్ షోలకు మంచి టాక్ ను సొంతం చేసుకుంటే…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ బిజినెస్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఈ టార్గెట్ ను ఎంతవరకు అందుకోగలుగుతుందో, ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించగలుగుతుందో చూడాలి ఇక..