Home న్యూస్ కీడా కోలా రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

కీడా కోలా రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు(Pelli Choopulu) తోనే బ్లాక్ బస్టర్ కొట్టి తర్వాత ఈ నగరానికి ఏమైంది(Ee Nagaraniki Emaindi) లాంటి కల్ట్ మూవీ తీసిన తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కీడా కోలా(Keedaa Cola) సినిమా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీగానే రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ….

తన తాతయ్య బ్రహ్మానందంతో కలిసి ఉండే హీరో తన ఫ్రెండ్ తో కలిసి డబ్బు కోసం కీడా కోలా అనే కంపెనీ బాటిల్ లో బొద్దింక రావడంతో ఆ కంపెనీ ఓనర్ కి 5 కోట్లు కావాలని డిమాండ్ చేస్తారు… మరో వ్యక్తి తనకి జరిగిన అన్యాయానికి పొలిటికల్ లీడర్ అవ్వాలని ఆశిస్తాడు..దానికి డబ్బు అవసరం అవుతుంది… ఈ ఆ తర్వాత ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

సినిమా చూసే ముందు ఇది చాలా నార్మల్ బేసిక్ కథ అని ప్రిపేర్ అయ్యి అంచనాలు కొంచం తక్కువగా పెట్టుకుని థియేటర్స్ కి వెళితే సినిమా స్టోరీ పాయింట్ చాలా తిన్ గా ఉన్నా కూడా సీన్ బై సీన్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకునే విషయంలో తరుణ్ భాస్కర్ సక్సెస్ అయ్యాడు… సీన్ ఏదైనా కూడా కామెడీ చేయడమే…

ధ్యేయంగా పెట్టుకోవడంతో సింగిల్ లైన్ పంచులు, కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి…. ఇక యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో అదరగొట్టేశారు. తరుణ్ భాస్కర్ రోల్ కూడా ఎక్స్ లెంట్ గా ఉండగా ఆ రోల్ కి ఒక సోలో సినిమా చేసే రేంజ్ ఉందని చెప్పొచ్చు… బ్రహ్మానందం కూడా ఆకట్టుకోగా….

సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా కుదిరాయి. ఎడిటింగ్ పర్వాలేదు అనిపించేలా ఉండగా కొన్ని సీన్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేసినా కూడా ఓవరాల్ గా ఎంటర్ టైన్ మెంట్ పరంగా సినిమా ఏమాత్రం నిరాశ పరచలేదు అనే చెప్పాలి… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా మెప్పించగా…

డైరెక్షన్ పరంగా తరుణ్ భాస్కర్ మరీ పెళ్లి చూపులు ఈనగరానికి ఏమైంది రేంజ్ లో మెప్పించక పోయినా వాటి మ్యాజిక్ ని చాలా వరకు అందుకుందని చెప్పొచ్చు… కొంచం లో ఎక్స్ పెర్టేషన్స్ తో థియేటర్స్ కి వెళితే మాత్రం సినిమా చాలా వరకు సినిమా అంచనాలను అందుకుని మెప్పించవచ్చు…. ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here