Home గాసిప్స్ ట్రేడ్ టాక్: వీళ్ళు 20 అంటే వాళ్ళు 40-45 అంటున్నారు!!

ట్రేడ్ టాక్: వీళ్ళు 20 అంటే వాళ్ళు 40-45 అంటున్నారు!!

0

రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన KGF సినిమా అన్ని భాషల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది… కన్నడ సినిమా నే అయినా ఆల్ ఇండియా లెవల్ లో రచ్చ చేసిన ఈ సినిమా రెండో పార్ట్ పై అంచనాలు కూడా పీక్స్ లో పెరిగేలా చేసింది. దాంతో రెండో పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇక కరోనా ఎఫెక్ట్ ఉన్నా కానీ ప్రస్తుతానికి ఇయర్ ఎండ్ కి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం అయితే గట్టిగా ఉందని చెప్పాలి. ఒకవేళ మిస్ అయిన వచ్చే ఇయర్ సంక్రాంతి రేసు లో కూడా నిలిచే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఇక మొదటి పార్ట్ సాధించిన అల్టిమేట్ హిట్ తో…

రెండో పార్ట్ పై క్రేజ్ భారీగా పెరిగిపోగా భారీ రేట్లకి సినిమాను అమ్మాలి అని నిర్మాతలు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది, కానీ వాళ్ళ అంచనాలకు తగ్గట్లు బిజినెస్ ఆఫర్స్ రావడం లేదని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో సినిమా క్రేజ్ దృశ్యా అవలీలగా 40 నుండి 45 కోట్ల రేంజ్ లో సినిమా..

బిజినెస్ ని సొంతం చేసుకుంటుంది అని అంచనా వేయగా ఇక్కడ నుండి ముగ్గురు నలుగురు నిర్మాతలు కే.జి.ఎఫ్ నిర్మాతలకు సుమారు 20-25 కోట్ల రేంజ్ లో బిజినెస్ ప్రపోజల్స్ ని చేసినట్లు చెబుతున్నారు. అంటే నిర్మాతలు అనుకున్న రేంజ్ బిజినెస్ కి సగం బిజినెస్ అన్న మాట. మొదటి పార్ట్ కి కేవలం 3-4 కోట్ల రేంజ్ బిజినెస్ జరగగా…

సినిమా సాధించిన విజయం దృశ్యా 20-25 కోట్ల రేంజ్ బిజినెస్ డబ్ మూవీ కి అంటే ఎక్కువే కానీ సినిమా మాస్ లో సాధించిన క్రేజ్ దృశ్యా 40-45 కోట్ల కి తగ్గే ప్రసక్తే లేదని నిర్మాతల నుండి సంకేతాలు అందుతున్నాయని లేటెస్ట్ ట్రేడ్ టాక్. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంతకు మించి రిస్క్ చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. సో బిజినెస్ ఇంకా ఓపెన్ గానే ఉండటం తో తర్వాత బెటర్ ఆఫర్స్ ని ఫైనల్ చేయోచ్చు అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here